Modi:మోదీ.. గీత రచన, ఆలాపన!
ABN , First Publish Date - 2023-06-17T05:40:55+05:30 IST
ప్రధాని మోదీ కలం పట్టారు. ఓ పాట రాశారు! ఆ గీతానికి తన గొంతునూ ఇచ్చారు! 2023ను ఐరాస తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం తెలిసిందే కదా!
ఆరోగ్యానికి తృణధాన్యాలు చేసే మేలు గురించి
గాయిని ఫాల్గుణితో కలిసి పాట రూపకల్పన
న్యూయార్క్, జూన్ 16: ప్రధాని మోదీ కలం పట్టారు. ఓ పాట రాశారు! ఆ గీతానికి తన గొంతునూ ఇచ్చారు! 2023ను ఐరాస తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం తెలిసిందే కదా! ఆరోగ్యానికి ఎంతో ఉపకరించే తృణ ధాన్యాలను ఆహారంలో ఎక్కువగా తీసుకునేలా ప్రజలకు ఓ పాట రూపంలో అవగాహన కల్పిస్తే బాగుంటుందని ఆయన ఈ చొరవ తీసుకున్నారు. గ్రామీ అవార్డు విజేత, ప్రముఖ భారత-అమెరికన్ గాయని ఫాల్గుణి షా(ఫాలు)తో కలిసి ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’(తృణధాన్యాల్లో సమృద్ధి) అనే పాట రాశారు. హిందీ, ఇంగ్లిషులో రూపొందించిన గీతాన్ని ఫాల్గుణి దంపతులు శుక్రవారం విడుదల చేశారు. గీతం మధ్యలో ప్రధాని మోదీ స్వరాన్నీ శ్రోతలు వినొచ్చు!
20న అమెరికాకు ప్రధాని
న్యూఢిల్లీ: ఈ నెల 20 నుంచి 25 మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. అమెరికాలో న్యూయార్క్‌లో ఆయన పర్యటన మొదలవుతుందని పేర్కొంది. ‘‘న్యూ యార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ నెల 21న పాల్గొంటారు. 22న అమెరికా దేశ అధ్యక్షుడు బైడెన దంపతులతో సాయంకాల విం దులో పాల్గొంటారు. అదే రోజున అమెరికా చట్టసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్, విదేశాంగ మంత్రి ఆంటో నీ బ్లింకెన ఏర్పాటు చేసే విందులో పాల్గొంటా రు. యూఎ్‌సలోని విధ సంస్థల అధినేతలు, భారత సంతతి ప్రజలతోనూ భేటీ అవుతారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో మోదీ ఆ దేశంలో పర్యటిస్తారు. కెయిరోకు ఇదే ఆయన తొలి పర్యటన. అక్కడి ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులు, భారత సంతతి వ్యక్తులతో ఆయన సమావేశమవుతారు’’ అని ఎంఈఏ వెల్లడించింది. కాగా, తొమ్మిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా ఈ నెల 21న న్యూయార్క్‌లోని యూఎన్ హెడ్‌క్వార్టర్స్ వద్ద యోగాపై జరిగే ప్రత్యేక సెషన్‌కు ప్రధా ని మోదీయే నేతృత్వం వహించనుండడం విశేషం. తాజాగా యూఎన్ జనరల్ అసెంబ్లీ(77వ సెషన్) అధ్యక్షుడు కసాబా కొరొసి.. ‘యూఎన్ హెడ్ క్వార్టర్ వద్ద ప్రధాని మోదీతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎదురుచేస్తున్నా..’ అని ట్వీట్ చేశారు. మోదీ ఈ ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘యోగా ప్రపంచాన్ని మంచి ఆరోగ్యం, స్వాస్థత దిశగా నడిపిస్తుంది.. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాను..’ అని బదులిచ్చారు.