Baljeet Kaur : పర్వతారోహకురాలు బల్జీత్‌ కౌర్‌ సురక్షితం

ABN , First Publish Date - 2023-04-19T03:25:48+05:30 IST

నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతంపై తప్పిపోయిన భారత్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు బల్జీత్‌ కౌర్‌(27) ఆచూకీ లభ్యమైంది. ఏరియల్‌ సర్వే ద్వారా బల్జీత్‌ను

 Baljeet Kaur : పర్వతారోహకురాలు బల్జీత్‌ కౌర్‌ సురక్షితం

8అన్నపూర్ణ పర్వతంపై ఆచూకీ లభ్యం, ఆస్పత్రికి తరలింపు

కాఠ్‌మాండూ, ఏప్రిల్‌ 18 : నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతంపై తప్పిపోయిన భారత్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు బల్జీత్‌ కౌర్‌(27) ఆచూకీ లభ్యమైంది. ఏరియల్‌ సర్వే ద్వారా బల్జీత్‌ను రక్షించిన రెస్క్యూ సిబ్బంది ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన బల్జీత్‌ ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో పదో స్థానంలో ఉన్న అన్నపూర్ణ పర్వత శిఖరాగ్రానికి సోమవారం విజయవంతంగా చేరుకున్నారు. అయితే, కిందికి దిగి వస్తుండగా ఆక్సిజన్‌ కొరతతో ఆచూకీ లేకుండా పోయారు. చివరికి ‘‘రక్షించండి ’’అంటూ మంగళవారం ఉదయం ఆమె బేస్‌ క్యాంప్‌నకు సందేశం పంపగా జీపీఎస్‌ ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. సముద్రమట్టానికి 24,193 అడుగుల ఎత్తున హిమాపాతంలో చిక్కుపోయిన బల్జీత్‌ను సహాయక సిబ్బంది కాపాడారు. క్యాంప్‌-4 వద్ద పడిపోయిన యువ పర్వతారోహకుడు అర్జున్‌ వాజ్‌పేయిని కూడా సహాయక బృందాలు రక్షించాయి. కాగా, రాజస్థాన్‌కు చెందిన అనురాగ్‌ మలు కూడా అన్నపూర్ణపై సోమవారం తప్పిపోయారు.

Updated Date - 2023-04-19T03:25:48+05:30 IST