Chhattisgarh polls: ఛత్తీస్‌ఘడ్‌లో ఉత్కంఠ రేపుతున్న ఫలితాల సరళి
ABN , First Publish Date - 2023-12-03T11:21:00+05:30 IST
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ ముందంజలో ఉండగా తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అయితే, ఛత్తీస్‌ఘడ్‌లో మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ ముందంజలో ఉండగా తెలంగాణలో కాంగ్రెస్‌కు విజయం దాదాపుగా ఖరారైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, ఛత్తీస్‌ఘడ్‌లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. సీఎం భూపేశ్ బాఘేల్ సారథ్యంలోని కాంగ్రెస్‌కు బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. 2018లో ఓటమి చవిచూసిన బీజేపీ ఈసారి రమణ్ సింగ్ సారథ్యంలో.. కాంగ్రెస్‌ను గద్దె దింపేందుకు కంకణం కట్టుకుంది.
అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగట్టుగా పోలింగ్ సరళి సాగుతుండటంతో ఛత్తిస్‌ఘడ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ 46 స్థానాల్లో ముందంజలో ఉండగా బీజేపీ 43 స్థానాల్లో లీడ్‌లో ఉంది. రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకునేందుకు మేజిక్ ఫిగర్ 46 కావడంతో తదుపరి జరిగేదేమిటన్న దానిపై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి.