Diya Kumari: దేశంలోనే హాట్ టాపిక్‌గా మారిన ఈ ‘వీధుల్లో నడిచే యువరాణి’ ఎవరంటే..
ABN , First Publish Date - 2023-12-13T08:29:10+05:30 IST
చూపు తిప్పుకోనివ్వని అందం.. హుందాతనానికి ఐకాన్. రాజకుటుంబంలో జన్మించారనే కాదు.. నిజానికి ఆమె కనిపించడమే మహారాణిలా కనిపిస్తారు. దేశంలోనే ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన ఆ మహిళ మరెవరో కాదు.. రాజస్థాన్ కొత్త ఉప ముఖ్యమంత్రి దియా కుమారి. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అక్కడి ముఖ్యమంత్రి గురించి గానీ మంత్రుల గురించి కానీ దేశం పట్టించుకోవడం లేదు ఒక్క దియా కుమారి గురించి తప్ప.
జైపూర్: చూపు తిప్పుకోనివ్వని అందం.. హుందాతనానికి ఐకాన్. రాజకుటుంబంలో జన్మించారనే కాదు.. నిజానికి ఆమె కనిపించడమే మహారాణిలా కనిపిస్తారు. దేశంలోనే ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన ఆ మహిళ మరెవరో కాదు.. రాజస్థాన్ కొత్త ఉప ముఖ్యమంత్రి దియా కుమారి. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అక్కడి ముఖ్యమంత్రి గురించి గానీ మంత్రుల గురించి కానీ దేశం పట్టించుకోవడం లేదు ఒక్క దియా కుమారి గురించి తప్ప. దియా కుమారి రాజ కుటుంబంలో జనవరి 30, 1971న జన్మించారు. ఆమె తాత, మాన్ సింగ్ II, బ్రిటీష్ రాజు కాలంలో జైపూర్‌ని పాలించే చివరి మహారాజు. దియా కుమారి తండ్రి భవానీ సింగ్ ఆర్మీలో కీలక అధికారిగా ఉండేవారు. బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్, 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు.
తొలిసారిగా ఎమ్మెల్యేగా రాజకీయరంగ ప్రవేశం..
ఆయన పరాక్రమానికి మహావీర చక్ర అవార్డును అందుకున్నారు. ఇక దియా కుమారి జైపూర్‌లోని మహారాణి గాయత్రీ దేవి స్కూల్‌లో తన పాఠశాల విద్యను.. ఆపై కాలేజ్ వచ్చేసి మహారాణి కళాశాలలో పూర్తి చేశారు. నరేంద్ర సింగ్ అనే వ్యక్తిని వివాహమాడారు. వారికి ప్రస్తుత మహారాజా పద్మనాభ్ సింగ్‌తో సహా వారికి ముగ్గురు పిల్లలు. 2018లో ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చారు. 2013లో రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా దియాకుమారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆపై 2019లో ఎంపీగా రాజ్‌సమంద్ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు.
వ్యాపారపరంగానూ దిట్టే..
ఇక రాజకీయాలే కాదు.. దియా కుమారి వ్యాపార పరంగానూ దిట్టే. రాజకీయాలతో సంబంధం లేకుండా.. రెండు పాఠశాలలు, ట్రస్టులు, మ్యూజియంలు, హోటళ్లు, అనేక ప్రభుత్వేతర సంస్థల సహా చాలా వ్యాపారాలను దియా కుమారి నిర్వహిస్తున్నారు. అలాగే మహారాజా సవాయి మాన్ సింగ్ II మ్యూజియం ట్రస్ట్, జైఘర్ ఫోర్ట్ ఛారిటబుల్ ట్రస్ట్ వంటి వాటిని కూడా ఆమె పర్యవేక్షిస్తున్నారు. దియా కుమారి తన పేరు మీద ‘ప్రిన్సెస్ దియా కుమారి ఫౌండేషన్ ’ నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా వృత్తిపరమైన శిక్షణ, విద్య, జీవనోపాధి కల్పన, మహిళలు - బాలికలకు సాధికారత కల్పించడంపై దృష్టి సారిస్తున్నారు.
దియా కుమారి ముద్దు పేరేంటో తెలుసా?
ఇక ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ స్థానం నుంచి దియా కుమారి 71,368 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తొలుత రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆమే అని అంతా అనుకున్నారు. కానీ బీజేపీ ఆమెను డిప్యూటీ సీఎంని చేసింది. ఇంతకీ అంతా దియా కుమారిని ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా? ‘వీధుల్లో నడిచే యువరాణి (princess who walks on the streets)’ అని. అంటే యువరాణులు బయటకు కనిపించరు కదా. పైగా వారు బయట అడుగు పెట్టారు. అలాంటిది దియా కుమారి మాత్రం ప్రజా సమస్యలను తెలుసుకుంటూ హాయిగా రోడ్డుపై నడుకుంటూ వెళతారు. అందుకే ఆమెను అలా పిలుచుకుంటున్నారు రాజస్థానీ ప్రజలు.