రైతు సమస్యలపై దేశవ్యాప్త పోరాటం: ఎస్కేఎం

ABN , First Publish Date - 2023-05-01T04:34:02+05:30 IST

రైతులు, వ్యవసాయ కార్మికులపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు, సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని..

రైతు సమస్యలపై దేశవ్యాప్త పోరాటం: ఎస్కేఎం

న్యూఢిల్లీ: రైతులు, వ్యవసాయ కార్మికులపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు, సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) నిర్ణయించింది. ఆదివారం ఢిల్లీలో సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ సమావేశం జరిగింది. ఇందులో సుమారు 200 మంది రైతు నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలని ఢిల్లీలో ధర్నా చేస్తున్న మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఎస్కేఎం ఈ సందర్భంగా తీర్మానం చేసింది.

Updated Date - 2023-05-01T04:34:02+05:30 IST