నాటోలోకి ఫిన్లాండ్‌.. 31కి పెరిగిన సభ్యదేశాలు

ABN , First Publish Date - 2023-04-05T02:02:30+05:30 IST

నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)లో ఫిన్లాండ్‌ కూడా చేరింది. దీంతో నాటో కూటమిలో సభ్య దేశాల సంఖ్య 31కి చేరుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఫిన్లాండ్‌ నాటోలో చేరడం

నాటోలోకి ఫిన్లాండ్‌.. 31కి పెరిగిన సభ్యదేశాలు

బ్రసెల్స్‌, ఏప్రిల్‌ 4: నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)లో ఫిన్లాండ్‌ కూడా చేరింది. దీంతో నాటో కూటమిలో సభ్య దేశాల సంఖ్య 31కి చేరుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఫిన్లాండ్‌ నాటోలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిన్లాండ్‌ చేరికపై తొలుత తుర్కియే, హంగేరీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే గత వారం తుర్కియే పార్లమెంటు ఆమోదం తెలపడంతో ఫిన్లాండ్‌ చేరికకు మార్గం సుగమమైంది. ఫిన్లాండ్‌ నాటోలో అధికారికంగా సభ్యదేశమైనట్లు కూటమి సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టాల్టెన్‌బర్గ్‌ మంగళవారం ప్రకటించారు.

Updated Date - 2023-04-05T02:02:30+05:30 IST