Opposition Unity: హేమంత్ సోరెన్‌ను కలిసిన నితీష్ కుమార్

ABN , First Publish Date - 2023-05-10T20:33:04+05:30 IST

రాంచీ: జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు కలుసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్న నితీష్ కుమార్ ఇందులో భాగంగా హేమంత్ సోరెన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. గంటసేపు ఉభయులూ సమావేశమయ్యారు.

Opposition Unity: హేమంత్ సోరెన్‌ను కలిసిన నితీష్ కుమార్

రాంచీ: జార్ఖాండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ (Hemant Soren)ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు కలుసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత (Opposition Unity)కు కృషి చేస్తున్న నితీష్ కుమార్ ఇందులో భాగంగా హేమంత్ సోరెన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. నితీష్ వెంట ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. సుమారు గంటసేపు వీరి సమావేశం జరిగింది.

ఐక్య విపక్ష కూటమి ఏర్పాటు చుట్టూనే తాము చర్చించామని, చర్చల ఫలితం 2024 లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా కనిపిస్తుందని సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ నితీష్ కుమార్ తెలిపారు. చరిత్రలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నామని, హిందూ-ముస్లింల ఐక్యతను పునరుద్ధరిస్తామని అన్నారు.

బీజేపీతో సంబంధాలను గత ఏడాది తెగతెంపులు చేసుకున్న నితీష్ కుమార్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ప్రకటించారు. ఇందుకోసం విపక్షాలను కూడగట్టి ఐక్యతా కూటమిని ఏర్పాటు చేసేందుకు పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ, విపక్ష నేతలను కలుస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి, బీజేపీ నేత నవీన్ పట్నాయక్‌ను మంగళవారంనాడు భువనేశ్వర్‌లో కలుసుకున్నారు. ఇటీవలే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను కలిశారు.

Updated Date - 2023-05-10T20:39:08+05:30 IST