Share News

Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు..

ABN , First Publish Date - 2023-11-27T10:58:04+05:30 IST

పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలపై నెలకొన్న స్తబ్ధత వీడింది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న రానుండగా.. 4వ తేదీ నుంచి సమావేశాలు జరపనున్నట్లు తెలుస్తోంది.

Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు..

ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభ తేదీలపై (Parliament Winter session) స్తబ్ధత వీడింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్న మరసటి రోజు డిసెంబర్ 4 నుంచి సమావేశాలు మొదలుకానున్నాయని సమాచారం. డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi) డిసెంబర్ 2న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. నిజానికి పార్లమెంట్ సెషన్ ప్రారంభానికి ఒక రోజు డిసెంబర్ 3నే అఖిలపక్ష సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ అదే రోజున 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉండడంతో డిసెంబర్ 2న సమావేశమవనున్నారు.

కీలక బిల్లుల ఆమోదింపజేసుకోవాలని చూస్తున్న ఎన్డీఏ(NDA) సర్కార్‌పై 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపించవచ్చనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


హోమ్‌పై స్టాండింగ్ కమిటీ ఇప్పటికే మూడు నివేదికలను ఆమోదించినందున, ఐపీసీ(IPC), సీఆర్‌పీసీ(CrPC), ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో మూడు కీలక బిల్లులను ఈ సెషన్ లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కారణంగా పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ఈ బిల్లుకి ఆమోదం లభించలేదు. ఈ బిల్లు కేబినెట్ హోదాతో సమానంగా CEC, ECల హోదాను మార్చాలని సూచిస్తోంది.

Updated Date - 2023-11-27T11:45:49+05:30 IST