Home » INDIA Alliance
కేంద్రప్రభుత్వం 2024లో వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లను ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నేపథ్యంలో జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లును పంపింది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఫిక్స్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మూడోసారి కూడా అడ్రస్ లేకుండా పోగా.. ఆప్ పార్టీ నాలుగోసారి ఢిల్లీ గద్దెనెక్కాలనే ఆశ ఆవిరైంది. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆప్, కాంగ్రెస్ పార్టీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలసికట్టుగా ఉండనందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
'ఇండియా' కూటమి పనితీరుపై మమతా బెనర్జీ గతవారంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకాశం వస్తే కూటమికి సారథ్యం వహిస్తానన్నారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని, దానిని నడపాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ఇండియా కూటమి పార్టీలు దీనిపై సంతకాలు చేశాయి. ఈ రెండు పార్టీలు అదానీ అంశంపై కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నాయి.
కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని గద్దె దించాలంటే.. ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నాయకత్వం వహించాలనే డిమాండ్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది.
రాజ్యసభలో మాట్లాడేందుకు తమకు సమయం కేటాయించే విషయంలో జగ్దీప్ ధన్ఖఢ్ వివక్ష చూపుతున్నారని, తాము మాట్లాడుతుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారని విపక్ష నేతల అభియోగంగా ఉంది.
ఇప్పటిరవకు ఇండియా కూటమిని కాంగ్రెస్ లీడ్ చేస్తుండగా.. తాజాగా మమతా బెనర్జీ తాను నాయకత్వం వహించేందుకు సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టడంతో ఇండియా కూటమిలో చీలిక వస్తుందేమోననే చర్చ దేశ వ్యాప్తంగా మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాకుండా అడ్డకట్ట వేయలేకపోయినప్పటికీ.. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకుండా ..
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి కలిసికట్టుగా పోటీ చేస్తుందని జేఎంఎం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారంనాడు ప్రకటించారు.
ఎన్డీయేకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్కు తమ పార్టీ లేఖ రాసినట్టు ఒవైసీ తెలిపారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని అన్నారు.
హరియాణాలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఫలించినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత సీఎం నయాబ్ సింగ్ సైనీ.. సీఎంగా కొనసాగడం దాదాపు ఖాయమైంది.