Narendra Modi : ప్రాంతీయ భాషలపై మోదీ వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-07-29T14:51:01+05:30 IST
మన దేశంలో పరిపుష్టమైన, సౌభాగ్యవంతమైన భాషలు అనేకం ఉన్నాయని, అయితే అవి ప్రగతి నిరోధక భాషలనే ముద్ర వేశారని, ఇంత కన్నా దురదృష్టం వేరొకటి ఉంటుందా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. జాతీయ విద్యా విధానం, 2020 మూడో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం ఆయన ఆలిండియా ఎడ్యుకేషన్ కన్వెన్షన్‌ను ప్రారంభించారు.
న్యూఢిల్లీ : మన దేశంలో పరిపుష్టమైన, సౌభాగ్యవంతమైన భాషలు అనేకం ఉన్నాయని, అయితే అవి ప్రగతి నిరోధక భాషలనే ముద్ర వేశారని, ఇంత కన్నా దురదృష్టం వేరొకటి ఉంటుందా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రశ్నించారు. జాతీయ విద్యా విధానం (NEP), 2020 మూడో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం ఆయన ఆలిండియా ఎడ్యుకేషన్ కన్వెన్షన్‌ను ప్రారంభించారు.
ఆంగ్లంలో మాట్లాడటం రానివారి ప్రతిభను ఎన్నడూ ఆమోదించేవారు కాదన్నారు. గ్రామీణ ప్రాంతాలవారు ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొన్నారని తెలిపారు. తాను ఐక్య రాజ్య సమితిలో కూడా భారతీయ భాష (హిందీ)లోనే మాట్లాడతానని చెప్పారు. జాతీయ విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల దేశానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. భాషలతో విద్వేష వ్యాపారాలు చేసేవారి షట్టర్లు మూతపడతాయని చెప్పారు.
ఈ కార్యక్రమం ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో జరిగింది. అఖిల భారతీయ శిక్షా సమాగమం పేరుతో శని, ఆదివారాల్లో ఈ కన్వెన్షన్ జరుగుతుంది. విద్యావేత్తలు, సబ్జెక్ట్ నిపుణులు, విధాన నిర్ణేతలు, పారిశ్రామిక రంగ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
సెప్టెంబరులో జీ20 సదస్సు కూడా భారత్ మండపంలోనే జరగబోతోంది.
ఇవి కూడా చదవండి :
Manipur : మణిపూర్ బయల్దేరిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు
Bharat Jodo Yatra : ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టితో మరోసారి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’