LPG Price: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్రం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న ఎల్‌పీజీ గ్యాస్ ధర.. ఏ మేరకు అంటే..?

ABN , First Publish Date - 2023-08-29T15:26:58+05:30 IST

నిత్యావసరాల ధరలన్నీ గత కొద్ది నెలలుగా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు ఒకింత ఊరట కలగనుంది. ఎల్‌పీజీ సిలెండర్ ధరను తగ్గించేందుకు కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. సిలెండర్ ధర రూ.200 మేరకు తగ్గించనుందని, రాబోయే 24 గంటల్లో కేంద్రం ఈ మేరకు కీలక ప్రకటన చేయనుందని తెలుస్తోంది.

LPG Price: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్రం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న ఎల్‌పీజీ గ్యాస్ ధర.. ఏ మేరకు అంటే..?

న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరలన్నీ గత కొద్ది నెలలుగా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు ఒకింత ఊరట కలగనుంది. ఎల్‌పీజీ సిలెండర్ ధరను (LPG price) తగ్గించేందుకు (Slashed) కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. సిలెండర్ ధర రూ.200 మేరకు తగ్గించనుందని, రాబోయే 24 గంటల్లో కేంద్రం ఈ మేరకు కీలక ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్‌పీజీ సిలెండర్ ధర రూ.1,100 వరకూ ఉంది.


రాబోయేదంతా ఎన్నికల సీజన్ కావడం, చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరల వ్యవహారం ఎన్నికల అంశం కానుండటంతో కేంద్రం ఎల్‌పీజీ ధరల తగ్గింపు నిర్ణయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు చెబుతున్నారు. టమోటా ధరలు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తుండగా, రాబోయే రోజుల్లో ఉల్లిగడ్డల ధరలు టమోటా ధరలను మించిపోనున్నాయని బలంగా వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ధరలపై అదుపునకు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ధరలు తగ్గలేదనే అభిప్రాయం కూడా వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది.


బీజేపీకి ఏమేరకు లాభం?

ఎల్‌పీజీ ధరల తగ్గించడం వల్ల త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీకి లాభించే అవకాశాలు ఉండవచ్చని చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సోమవారంనాడు పలు ఎన్నికల హామీలు ఇచ్చారు. రూ.450 కే సిలెండర్ ఇస్తామన్న హామీ ఇందులో ఒకటి. శ్రావణ మాసంలో సిలెండర్ రూ.450కే ఇస్తున్నామని, 1.25 కోట్ల మంది మహిళలకు రూ.250 చొప్పున వారి అకౌంట్లకు నేరుగా వేస్తున్నామని ప్రకటించారు. తక్కిన రూ.1,000 (లాడ్లీ బెహ్నా యోజన) సెప్టెంబర్‌లో జమ చేస్తామని ప్రకటించారు.

Updated Date - 2023-08-29T15:32:23+05:30 IST