PM Modi Mathura Visit: మథురలోని శ్రీ కృష్ణ జన్మ భూమి ఆలయాన్ని దర్శించుకున్న ప్రధాని
ABN , First Publish Date - 2023-11-23T18:43:32+05:30 IST
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మథురలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ శ్రీ కృష్ణ జన్మ భూమి ఆలయాన్ని దర్శించుకున్నారు. బ్రజ్‌రాజ్ ఉత్సవ్, మీరాబాయి జన్మోత్సవ్(Mirabai Janmosthav) సందర్భంగా ప్రధాని అక్కడ పర్యటించారు.
లఖ్ నవూ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మథురలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ శ్రీ కృష్ణ జన్మ భూమి ఆలయాన్ని దర్శించుకున్నారు. బ్రజ్‌రాజ్ ఉత్సవ్, మీరాబాయి జన్మోత్సవ్(Mirabai Janmosthav) సందర్భంగా ప్రధాని అక్కడ పర్యటించారు. ఎన్నికల ప్రచారానికి కాస్తంత విరామం ఇచ్చారు.
ఆయన వెంట సీఎం యోగి ఆదిత్య నాథ్(Yogi Adityanath), మంత్రులు ఉన్నారు. నగరంలోని బాంకే బిహారీ ఆలయాన్ని కూడా ప్రధాని సందర్శించారు. బ్రజ్ రాజ్ ఉత్సవ్‌లో భాగంగా నవంబర్ 23 నుండి 25 వరకు సంత్ మీరాబాయి ఫెస్ట్ నిర్వహిస్తారు. మీరాబాయి జీవితాన్ని వర్ణించే నృత్య దృశ్యాన్ని ప్రధాని తిలకించారు.
మీరాబాయికి అంకితం చేస్తూ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్‌లోని దీనదయాళ్ ఉపాధ్యాయ్ ఆడిటోరియంలో శుక్ర, శనివారాల్లో జాతీయ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ పండితులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. మీరాబాయి జన్మోత్సవ్ సందర్భంగా 1979లో రిలీజ్ అయిన 'మీరా' చిత్రాన్ని శుక్రవారం రూపమ్ టాకీస్‌లో రీరిలీజ్ చేయనున్నారు.