Bhagwant Mann Singh: మా మౌనం కారణంగానే ఆయన సీఎం కుర్చీలో ఉన్నాడు.. పంజాబ్ సీఎం కూమార్తె సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-12-10T19:43:11+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కుమార్తె సీరత్ కౌర్ మాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. తాను భగవంత్ మాన్ కుమార్తెనని, ఆయన ‘నాన్న’ అని పిలిచే హక్కును చాలాకాలం క్రితమే...
Seerat Kaur On Bhagwant Mann Singh: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కుమార్తె సీరత్ కౌర్ మాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. తాను భగవంత్ మాన్ కుమార్తెనని, ఆయన ‘నాన్న’ అని పిలిచే హక్కును చాలాకాలం క్రితమే కోల్పోయాడు కాబట్టి తాను ఆయన్ను సీఎం మాన్ అని పిలుస్తున్నానని పేర్కొంది. తమ కుటుంబాన్ని ఆయన్ను నిర్లక్ష్యం చేశారని, తాము మౌనంగా ఉన్నాం కాబట్టే ఆయన ఆ ఉన్నత స్థాయిలో కూర్చున్నాడని ఆమె కుండబద్దలు కొట్టింది.
‘‘ఈ వీడియో చేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. కేవలం మా పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. ఏదైతే ప్రజలు మా గురించి విన్నారో, అది స్వయంగా సీఎం మాన్ చెప్పారు. ‘‘మా మౌనాన్ని బలహీనతగా భావించినట్లు అనిపిస్తోంది. అయితే.. అలా భావించొద్దు. మా మౌనం కారణంగానే ఆయన ప్రస్తుతం సీఎం కూర్చీలో కూర్చున్నాడన్న సంగతి సీఎం మాన్‌కి తెలీదు’’ అని సీరత్ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సీఎం రెండో భార్య గర్భంతో ఉందని, భగవంత్ మాన్ మూడోసారి తండ్రి కాబోతున్నాడని, ఈ విషయం కూడా తమకు ఇతరుల వల్లే తెలిసిందని ఆ వీడియోలో సీరత్ పేర్కొంది. తమ మధ్య ఎలాంటి కమ్యునికేషన్ లేదని ఆమె నిరాశ వ్యక్తం చేసింది. ప్రస్తుత పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని భగవంత్‌పై మండిపడింది.
గతంలో భగవంత్ మాన్ సింగ్‌ని కలవడం కోసం తన సోదరుడు దోషన్ రెండుసార్లు పంజాబ్‌కి వెళ్లాడని, అయితే అతనికి ప్రతికూలతల్ని ఎదురయ్యాయని, తన ఇంట్లోని దోషన్‌ని సీఎం రానివ్వలేదని సీరత్ బాంబ్ పేల్చింది. తన సొంత పిల్లల బాధ్యత తీసుకోలేని వ్యక్తి.. పంజాబ్ ప్రజల బాధ్యతను ఎలా తీసుకుంటాడని ఆమె ఆరోపించింది. సీఎం భగవంత్ తమను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా వేధించాడని సీరత్ ఆ వీడియోలో పేర్కొంది. అంతేకాదు.. ఆయన పూటుగా మద్యం సేవిస్తాడని, అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని, మద్యం సేవించే ఆయన ఎన్నో అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారని సంచలన ఆరోపణలు చేసింది. తాము ఏ బాధలైతే ఎదుర్కున్నామో.. ఇప్పుడు పంజాబ్ ప్రజలు కూడా అలాంటి బాధలే ఎదుర్కుంటున్నారని వ్యాఖ్యానించింది.
ఈ వీడియోని బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గా తన ఎక్స్ వేదికలో షేర్ చేస్తూ.. ఈ ఆరోపణలపై మాట్లాడాల్సిందిగా AAP అగ్రనేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కోరారు. ‘‘భగవంత్ మాన్‌పై ఆయన కుమార్తె చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. భగవంత్ మాన్ తన కొడుకును సీఎం హౌస్‌లోకి రాకుండా ఆపడం లేదా మద్యం మత్తులో గురుద్వారా, అసెంబ్లీకి వెళ్లడం లేదా మద్యం సేవించి తన భార్యతో చెడు పనులు చేయడం.. వంటి ఆరోపణలపై మీరు మాట్లాడతారా? లేదా భగవంత్ మాన్‌తో కలిసి ఇసుకలో డబ్బు తింటూ మౌనంగా ఉంటారా?’’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.