Home » Bhagwant Singh Mann
తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ ను కరడుగట్టిన క్రిమినల్స్ కంటే దారుణంగా చూస్తున్నారని, ఒక గ్లాస్ వాల్ గుండా ఫోనులో ఆయన తనతో మాట్లాడారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తెలిపారు.
అయోధ్యలో రామాలయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ఈనెల 12వ తేదీ సోమవారంనాడు దర్శించనున్నారు. వీరు ఉభయులు తమ కుటుంబసభ్యులతో కలిసి అయోధ్య రామాలయాన్ని దర్శించనున్నట్టు పార్టీ వర్గాలు అదివారం తెలిపాయి.
రిపబ్లిక్ డే పరేడ్-2024లో శకటాల ప్రదర్శనకు పంజాబ్ శకటానికి చోటు దక్కకపోవడంపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ చర్య పంజాబ్ పట్ల కేంద్రానికి ఉన్న వివక్షను చాటుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చేసిన వ్యాఖ్యాలను కేంద్ర రక్షణ శాఖ ఆదివారంనాడు తోసిపుచ్చింది. మాస్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కుమార్తె సీరత్ కౌర్ మాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. తాను భగవంత్ మాన్ కుమార్తెనని, ఆయన ‘నాన్న’ అని పిలిచే హక్కును చాలాకాలం క్రితమే...
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఒక మహిళ రాఖీ పట్టుకుని ఆయన ఉన్న వేదకపైకి వచ్చింది. వెంటనే ఆయన తన ప్రసంగాన్ని ఆపేసి రాఖీ కట్టించుకుని, ఆ తర్వాత నిండుమనసులో ఆ సోదరిని ఆశీర్వదించారు.
శాంతిని కోరుకునే పంజాబ్ ప్రజలను గవర్నర్ బెదిరిస్తున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తామని హెచ్చరిస్తూ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ నకు రాసిన లేఖపై భగవంత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు.
కొంతకాలం నుంచి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ మధ్య కొనసాగుతున్న లేఖల యుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది. శుక్రవారం సీఎంకు గవర్నర్ స్ట్రాంగ్ వార్నింగ్...
స్వర్ణ దేవాలయానికి చెందిన గుర్బానీ అంశం పంజాబ్‌లో రాజకీయ వేడి రగల్చింది. సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా క్లాజ్ తీసుకువస్తున్నామని, గుర్బానీ అందరికీ ఉచితంగా అందుబాటులోకి తెస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చేసిన ప్రకటన ఈ వివాదానికి కారణమైంది. సీఎం ప్రకటనపై శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ ఆక్షేపణ వ్యక్తం చేసింది.
క్యాబినెట్ నిర్ణయం ప్రకారం కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న, అనివార్య కార్యణాల వల్ల పదేళ్లకు మించి సర్వీసు చేయలేకపోయిన 14,239 మంది కాంట్రాక్టు టీచర్లను రెగ్యులరైజ్ చేయనున్నారు.
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సంచలన విషయం బయటపెట్టారు. పంజాబ్‌కు సారథ్యం వహించాలని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా సిద్ధూను కోరారని అన్నారు.