Punjab: సునామ్ కోర్టు తీర్పు.. మంత్రికి రెండేళ్లు జైలు శిక్ష
ABN , Publish Date - Dec 22 , 2023 | 08:05 AM
పంజాబ్ మంత్రి అమన్ అరోరాకు సునామ్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కుటుంబ వివాదాల కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది. అమన్ అరోరాతోసహా 9 మందికీ రెండేళ్ల జైలు శిక్షను విధించింది.
చండీగఢ్: పంజాబ్ మంత్రి అమన్ అరోరాకు సునామ్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కుటుంబ వివాదాల కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది. అమన్ అరోరాతోసహా 9 మందికీ రెండేళ్ల జైలు శిక్షను విధించింది. మంత్రి అమన్ అరోరా రాజిందర్ దీప ఫిర్యాదు ఆధారంగా విచారించిన కోర్టు ఈ తిర్పు వెలువరించింది. అమన్ అరోరాతోపాటు ఆయన సహచరులు తన ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడికి పాల్పడ్డారని రాజిందర్ దీపా 2008లో కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ టైంలో అమన్ అరోరా, రాజిందర్ దీపా ఇద్దరూ కాంగ్రెస్‌లో ఉన్నారు. సునామ్‌లో ఇద్దరు నేతల ఇళ్లు ఎదురెదురుగా ఉండగా, ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. అయితే ప్రస్తుతం వారిరువురు కాంగ్రెస్ లో లేరు. ప్రస్తుతం అమన్ అరోరా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు.
రాజిందర్ దీపా అకాలీదళ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దోషిగా తేలిన తర్వాత అమన్ అరోరా సంగ్రూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
2012లో తనకు, దీపకు మధ్య రాజీ కుదిరిందని, అయితే తన బావ ఇచ్చిన మాటను తుంగలో తొక్కాడని చెప్పాడు. దీపా తరపు న్యాయవాది సుశీల్ మాట్లాడుతూ.. దీపా పది మందిపై ఫిర్యాదు చేశారని, అందులో ఒకరు విచారణ మధ్యే మరణించారని తెలిపారు. దోషులు పై కోర్టులో అప్పీల్ దాఖలు చేయాలనుకుంటున్నట్లు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. అప్పీలు దాఖలు చేసేందుకు వారికి 30 రోజుల గడువు ఉందన్నారు.
"మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"