Home » Punjab
శిరోమణి అకాలీ దళ్ ఒక ప్రజాస్వామిక పార్టీ అని, పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ప్రతి ఐదేళ్లుకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని దల్జీత్ సింగ్ చీమా తెలిపారు. చివరిసారిగా 2019 డిసెంబర్ 14న ఎన్నికలు జరిగాయని, వచ్చే నెల డిసెంబర్ 14తో ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తుందని చెప్పారు.
హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. పాటల్లో అభ్యంతరకర విషయాల జోలికి వెళ్లొద్దంటూ సూచించింది.
నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్ఎల్డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
పంజాబ్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి జలమార్గం ద్వారా భారత్కు తరలిస్తున్న దాదాపు 105 కిలోల హెరాయిన్ను ఆ రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అప్పట్లో తీవ్ర కలకలం రేపిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓ నేరస్తుడిని ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను మంగళవారంనాడు ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఇదే సమయంలో పంజాబ్ లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ప్రకటించింది.
కుస్తీ యోధురాలు, ట్రిపుల్ ఒలింపియన్ వినేశ్ ఫొగట్ హరియాణా ఎన్నికల సమరంలో మాత్రం ఓ ‘పట్టు’ పట్టారు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో దురదృష్టవశాత్తు తృటిలో పతకం చేజారినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో ఇటీవల ఓ రోజు దొంగలు చొరబడ్డారు. ఆ సమయంలో మహిళ తన పిల్లలతో ఒంటరిగా ఉంది. రోడ్డు వైపు నుంచి ఆ ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లారు. ముగ్గురు దొంగలు తలో వైపు వెళ్లి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు.. అయితే..
శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ మరోసారి పెరోల్పై విడుదల కానున్నారు.
భగవంత్ మాన్ 'లెప్టోస్పిరోసిస్'తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలిందని మొహలిలోని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. అయితే ప్రధాన అవయవాలు నిలకబడగా పనిచేస్తు్న్నట్టు చెప్పారు.