Gurdas Mann:కెనడా పర్యటన రద్దు చేసుకున్న పంజాబ్ సింగర్.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-10-08T17:47:15+05:30 IST

భారత్ - కెనడా(India - Canada)ల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యోందాంతం తాలూకూ వివాదం చల్లారకపోవడంతో పంజాబ్ కి చెందిన ఫేమస్ సింగర్ ఒకరు కెనడా పర్యటన రద్దు చేసుకున్నారు. సింగర్ గురుదాస్ మాన్(Gurdas Mann) ఈ నెల 22 నుంచి 31 వరకు కెనడాలో ఓ షోలో పాల్గొనాల్సి ఉంది.

Gurdas Mann:కెనడా పర్యటన రద్దు చేసుకున్న పంజాబ్ సింగర్.. ఎందుకంటే?

చండీగఢ్: భారత్ - కెనడా(India - Canada)ల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యోందాంతం తాలూకూ వివాదం చల్లారకపోవడంతో పంజాబ్ కి చెందిన ఫేమస్ సింగర్ ఒకరు కెనడా పర్యటన రద్దు చేసుకున్నారు. సింగర్ గురుదాస్ మాన్(Gurdas Mann) ఈ నెల 22 నుంచి 31 వరకు కెనడాలో ఓ షోలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత్ హత్య చేసిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine Trudo) ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాన్ తెలిపారు.


ఇందుకు సంబంధించి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. అందులో "రెండు దేశాల మధ్య దౌత్యపరమైన అశాంతి నెలకొంది. ఈ టైంలో ఈవెంట్ నిర్వహించడం కరెక్ట్ కాదు. రద్దు చేయడమే సరైన నిర్ణయం" అంటూ పోస్ట్ చేశారు. ఇరు దేశాల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది రాజేసిన నిప్పు.. అంతకంతకూ రాజుకుంటునే ఉంది. రెండు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకున్న అనంతరం కెనడా తన దౌత్యవేత్తలను భారత్ నుంచి తరలించింది. కెనడాలో ఇండియా వీసా సేవలు నిలిపేసింది. ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా అడ్డాగా మారిందని భారత్ ఆరోపించింది.

Updated Date - 2023-10-08T18:08:59+05:30 IST