రాజాచారికి యూఎస్ఏఎఫ్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ హోదా

ABN , First Publish Date - 2023-01-28T03:03:52+05:30 IST

భారత సంతతి వ్యోమగామి రాజాచారికి అమెరికా వైమానిక దళ(యూఎస్ఏఎఫ్‌) బ్రిగేడియర్‌ జనరల్‌ హోదా లభించనుంది. ఈ మేరకు దేశాధ్యక్షుడు జో

రాజాచారికి యూఎస్ఏఎఫ్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ హోదా

- భారత సంతతి వ్యోమగామిని నామినేట్‌ చేసిన బైడెన్‌

వాషింగ్టన్‌, జనవరి 27: భారత సంతతి వ్యోమగామి రాజాచారికి అమెరికా వైమానిక దళ(యూఎస్ఏఎఫ్‌) బ్రిగేడియర్‌ జనరల్‌ హోదా లభించనుంది. ఈ మేరకు దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఆయన్ను గురువారం నామినేట్‌ చేశారు. ఈ నామినేషన్‌ను సెనేట్‌ ఆమోదించాల్సి ఉందని అమెరికా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చారి ఇప్పటికే వైమానిక దళ కల్నల్‌ స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో క్రూ-3 కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన చారి, ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం అమెరికాలోనే స్థిరపడ్డారు. నాసాకు, యూఎస్ఏఎఫ్‏లో పలు విభాగాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-01-28T03:03:53+05:30 IST