Rajasthan: మహిళలకు 40 లక్షల స్మార్ట్‌ఫోన్లు
ABN , First Publish Date - 2023-04-29T12:00:44+05:30 IST
రక్షా బంధన్ సందర్భంగా 40 లక్షల మంది మహిళలకు స్మార్ట్‌ఫోన్‌లను పంపిణీ చేయనున్నట్లు...
జైపూర్(రాజస్థాన్): రక్షా బంధన్ సందర్భంగా 40 లక్షల మంది మహిళలకు స్మార్ట్‌ఫోన్‌లను పంపిణీ చేయనున్నట్లు రాజస్థాన్ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ వెల్లడించారు.(Rajasthan Government)మూడేళ్ల ఇంటర్నెట్ ప్యాక్‌తో కూడిన ఉచిత స్మార్ట్‌ఫోన్‌లను మహిళలకు ఇస్తామని(Distribute Smartphones) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ప్రకటించారు.హనుమాన్‌ఘర్‌లోని రావత్‌సర్ పట్టణంలోని ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.చిరంజీవి హెల్త్ స్కీమ్ కింద మెడికల్ కవర్‌ను రూ. 25 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీకి బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు అసెంబ్లీలో సీఎం తెలిపారు.