Rameswaram: రామేశ్వరం రైల్వేస్టేషన్‌కు మహర్దశ
ABN , First Publish Date - 2023-01-22T10:00:32+05:30 IST
రామేశ్వరం రైల్వేస్టేషన్(Rameshwaram Railway Station)ను రూ.90 కోట్లతో రామనాధస్వామి ఆలయం, స్తంభాలతో రూపకల్పనతో
పెరంబూర్(చెన్నై), జనవరి 21: రామేశ్వరం రైల్వేస్టేషన్(Rameshwaram Railway Station)ను రూ.90 కోట్లతో రామనాధస్వామి ఆలయం, స్తంభాలతో రూపకల్పనతో పునరుద్ధరించనున్నారు. ప్రాచీనమైన ఈ రైల్వేస్టేషన్‌కు ప్రతిరోజు సుమారు 9 వేల మందికి పైగా భక్తులు వస్తుండగా, పండుగ రోజులు, విశేష దినాల్లో వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. నాలుగు ఫ్లాట్‌పారంలు, టాయిలెట్ వసతి, విశ్రాంతి గది, వాహనాల పార్కింగ్ తదితరాలు అందుబాటులో లేవు. భక్తుల విజ్ఞప్తి మేరకు ప్రధాని మోదీ ఉత్తర్వులతో రామేశ్వరం రైల్వేస్టేషన్ పునరుద్ధరణకు రూ.90.20 కోట్లు కేటాయించారు. ఇప్పటికే 11 ప్రాంతాల్లో మట్టి పరిశోధనలు పూర్తిచేసి, సమగ్ర ప్రణాళిక రూపొందించారు. కార్యాలయ నిర్వహణ భవనం పనులు పూర్తికాగా, నిర్మాణ సంస్థను ఎంపిక చేసి వచ్చే నెలలో పనులు ప్రారంభించి 2024 జూలైలోపు పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.