దలైలామా చేతికి రామన్ మెగసెసె అవార్డు
ABN , First Publish Date - 2023-04-27T01:41:34+05:30 IST
టిబెటిన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 1959లో ప్రకటించిన రామన్ మెగసెసె అవార్డును ఫౌండేషన్
64 ఏళ్ల తర్వాత అందజేసిన ఫౌండేషన్ సభ్యులు
ధర్మశాల, ఏప్రిల్ 26: టిబెటిన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 1959లో ప్రకటించిన రామన్ మెగసెసె అవార్డును ఫౌండేషన్ సభ్యులు 64 ఏళ్ల తర్వాత బుధవారం ధర్మశాలలో వ్యక్తిగతంగా అందజేశారు. ఈమేరకు ఆయన కార్యాలయం ప్రకటించింది. టిబెట్ వాసులు తమ పవిత్రమైన మతాన్ని పరిరక్షించుకొనేందుకు చేస్తున్న పోరాటానికి నాయకత్వం వహించినందుకు 1959 ఆగస్టులో ఈ అవార్డును ప్రకటించినట్లు దలైలామా కార్యాలయం తెలిపింది. రామన్ మెగసెసె అవార్డు ఫౌండేషన్ ప్రెసిడెంట్ సుసన్న బి అఫన్, ట్రస్టీ ఎమిలీ ఎ అబ్రరా దలైలామాను కలిసి అవార్డును ఆయన చేతుల్లో పెట్టారు. దలైలామా 1959 నుంచే టిబెట్‌ని వీడి భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు.