Danish ali Vs Bidhuri row: లోక్‌సభ హక్కుల కమిటీ ముందు హాజరుకాని బీజేపీ ఎంపీ బిధూడీ

ABN , First Publish Date - 2023-10-10T16:59:45+05:30 IST

బీఎస్‌పీ ఎంపీ దనీష్ అలీపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీ మంగళవారంనాడు లోక్‌సభ హక్కుల కమిటీ ముందు హాజరు కావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. తాను అందుబాటులో ఉండటం లేదంటూ ఆయన సమాచారం ఇచ్చారు.

Danish ali Vs Bidhuri row: లోక్‌సభ హక్కుల కమిటీ ముందు హాజరుకాని బీజేపీ ఎంపీ బిధూడీ

న్యూఢిల్లీ: బీఎస్‌పీ ఎంపీ దనీష్ అలీ (Danish ali)పై అనుచిత వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీ (Ramesh Bidhuri) మంగళవారంనాడు లోక్‌సభ హక్కుల కమిటీ ముందు హాజరు కావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. తాను అందుబాటులో ఉండటం లేదంటూ ఆయన సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు.


''మంగళవారంనాడు తాను అందుబాటులో ఉండటం లేదంటూ బీజేపీ నేత బిధూడీ పార్లమెంటరీ కమిటీకి లేఖ రాశారు. దనీష్ అలీపై వ్యాఖ్యలకు సంబంధించి తమ ముందు హాజరుకావాలంటూ హక్కుల కమిటీ ఆదేశాలిచ్చింది. ఈ కేసులో విచారణకు తదుపరి తేదీని పార్లమెంటు కమిటీ నిర్ణయిస్తుంది'' అని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.


ఇటీవల పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో సౌత్ ఢిల్లీ ఎంపీగా ఉన్న బిధూడి చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంపై మాట్లాడారు. ఆ సమయంలోనే ఆయన దనీష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాది ఉంటూ మండిపడ్డారు. ముస్లిం ఎంపీ అలీపై అలాంటి వ్యాఖ్యలు చేయడంతో సభలో అలజడి చెలరేగింది. కొత్త పార్లమెంటు సాక్షిగా తనను అవమానించారని దునీష్ అలీ ఆవేదన వ్యక్తం చేయగా, బిధూడీని స్పీకర్ ఓం బిర్లా మందలించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. బిధూడీపై చర్యలు తీసుకోవాలని దునీష్ అలీ లేఖ రాయడం, పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లాలని కోరడంతో లోక్‌సభ హక్కుల కమిటీ మందుకు ఈ వ్యవహారం చేరింది. బిధూడీ వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తూ ఆయనకు షోకాజ్ నోటీసులిచ్చింది.

Updated Date - 2023-10-10T16:59:45+05:30 IST