PM Modi House: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం..!
ABN , First Publish Date - 2023-07-03T09:41:01+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. ‘నో-ఫ్లైయింగ్ జోన్’లో డ్రోన్లు కనిపించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఎస్పీజీ భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై (PM Modi House) డ్రోన్ కలకలం రేపింది. ‘నో-ఫ్లైయింగ్ జోన్’లో (No-Flying Zone) డ్రోన్లు కనిపించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఎస్పీజీ భద్రతా సిబ్బంది (SPG) ఢిల్లీ పోలీసులకు సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు (Delhi Police) వెల్లడించారు. ఆ డ్రోన్ కోసం ఢిల్లీ పోలీసుల అన్వేషణ మొదలైంది. ఇప్పటికైతే ఎలాంటి డ్రోన్ ఆచూకీ తెలియలేదు. ప్రధాని నివాసం ‘రెడ్ నో-ఫ్లై జోన్ లేదా నో డ్రోన్ జోన్’ పరిధిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ జోన్‌లో డ్రోన్లపై నిషేధం ఉంటుంది. అయినప్పటికీ డ్రోన్ కనిపించిందని ఎస్పీజీ అధికారులు చెప్పడం కలకలం రేపుతోంది.
ఢిల్లీలోని ‘రేస్ కోర్స్ రోడ్’లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం ఉంది. ఈ నివాసం ఐదు భవనాల సముదాయం. 9,7,5,3,1 నంబర్లతో ఆ భవనాలు ఉండటం గమనార్హం. ప్రధాని కార్యాలయ సముదాయం భద్రతా వలయంలో ఉంటుంది. సామాన్య ప్రజానీకానికే కాదు మీడియాకు కూడా అనుమతి కష్టం. కొన్ని సందర్భాల్లో మాత్రమే విలేకరులను కాన్ఫరెన్స్ రూమ్స్ వరకూ అనుమతిస్తారు. అయితే.. ఫొటోలు తీయడం మాత్రం నిషేధం.