Rope car: నగరంలో ‘రోప్ కార్’
ABN , First Publish Date - 2023-01-05T07:47:08+05:30 IST
నగరంలో ‘రోప్ కార్’(Rope car) ఏర్పాటు కానుంది. మెరీనా బీచ్ నుంచి బీసెంట్‌నగర్ ఎలియట్స్ బీచ్ వరకు 4.6 కి.మీ
- మెరీనా నుంచి బీసెంట్‌నగర్ వరకు ఏర్పాటు
- అధ్యయనం చేస్తున్న కేంద్రం
చెన్నై, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): నగరంలో ‘రోప్ కార్’(Rope car) ఏర్పాటు కానుంది. మెరీనా బీచ్ నుంచి బీసెంట్‌నగర్ ఎలియట్స్ బీచ్ వరకు 4.6 కి.మీ మేర రోప్ కార్ ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అదే జరిగితే మెరీనాకు మరింత పర్యాటక శోభ చేకూరనుంది.. ఈ పథకం సాధ్యాసాధ్యాలపై జాతీయ రహదారులశాఖ పరిశీలిస్తోంది. ఆ శాఖ నివేదిక అనంతరం రోప్‌కార్ ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. దేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్తగా రోప్‌కార్ సేవలు ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో 5 కి.మీ రోప్‌కార్ సేవలుండగా, తర్వాత మెరీనా బీచ్(Marina Beach) నుంచి బీసెంట్‌నగర్ ఎలియట్ బీచ్ వరకు 4.6 కి.మీ మేర రోప్‌కార్ ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. మెరీనా బీచ్‌లో రోప్‌కార్ ఏర్పాటుచేస్తే పర్యావరణ ప్రభావం ఏమేరకు వుంటుందన్నదానిపైనా అధ్యయనం జరుగుతోంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో కొడైకెనాల్ - పళని ఆలయం మధ్య రోప్‌కార్ ఏర్పాటుపై అధ్యయనం జరుగుతోంది.