AMUL MD: ఆర్ఎస్ సోధి తొలగింపు, జయెన్ మెహతాకు బాధ్యతలు
ABN , First Publish Date - 2023-01-09T18:40:23+05:30 IST
గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మేనేజిమెంట్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి ని ఆ పదవి నుంచి...
అహ్మదాబాద్: గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మేనేజిమెంట్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి (RA Sodhi)ని ఆ పదవి నుంచి తొలగించారు. గాంధీనగర్‌లో సోమవారం జరిగిన ఫెడరేషన్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది. జీసీఎంఎంఎఫ్‌నే అమూల్ (AMUL)గా పిలుస్తుంటారు. ఆర్ఎస్ సోధి స్థానంలో కొత్త ఎండీగా అమూల్ సీఎం జయెన్ మెహతా బాధ్యతలు చేపట్టారు.
మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ఎస్ సోధి సేవలకు ముగింపు పలకాలని సమావేశం నిర్ణయం తీసుకున్నట్టు జీసీఎంఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనపై జీసీఎంఎంఎఫ్ చైర్మన్ శ్యామల్‌భాయ్ పటేల్, వైస్ చైర్మన్ వలంజీభఆయ్ హంబల్ సంతకాలు చేశారు. కాగా, ఎండీ పోస్టుకు తాను రాజీనామా చేసినట్టు సోధి ధ్రువీకరించారు. తాను పదవీకాలం పొడిగింపులో ఉన్నానని, తన రాజీనామాను బోర్డు ఆమోదించిందని తెలిపారు. సోథి 40 ఏళ్ల క్రితం సేల్స్‌మెన్‌గా జీసీఎంఎంఎఫ్‌లో చేరారు. గత రెండేళ్లుగా ఆయన ఎక్స్‌టెన్షన్‌లో ఉన్నారు. ఇండియన్ డైరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన 2010 జూన్ నుంచి జీసీఎంఎంఎఫ్ లిమిటెడ్ (అమూల్) ఎండీగా కొనసాగుతున్నారు.