Manipur:మణిపూర్ నుంచి వలస పోతున్న జనం... 2,500 రూపాయల విమాన టికెట్టు రూ.25వేలకు పెరిగింది...

ABN , First Publish Date - 2023-05-08T12:45:23+05:30 IST

హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి జనం ఇతర సురక్షిత ప్రాంతాలకు వలస పోతున్నారు....

Manipur:మణిపూర్ నుంచి వలస పోతున్న జనం... 2,500 రూపాయల విమాన టికెట్టు రూ.25వేలకు పెరిగింది...
Rush to flee violence hit Manipur

ఇంఫాల్ (మణిపూర్): హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి జనం ఇతర సురక్షిత ప్రాంతాలకు వలస పోతున్నారు.(Rush to flee violence hit Manipur) మణిపూర్ నుంచి జనం పెద్దసంఖ్యలో తరలిపోతుండటంతో విమాన చార్జీలకు(air ticket) రెక్కలు వచ్చాయి. ఇంఫాల్-కోల్‌కతా, ఇంఫాల్-గౌహతి మార్గాల్లో(Imphal-Kolkata and Imphal-Guwahati) విమాన టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి.2,500 రూపాయలున్న విమాన టికెట్ ధర 25వేల రూపాయలకు పెరిగింది. మే 3 నుంచి జాతి ఉద్రిక్తతలతో దెబ్బతిన్న మణిపూర్ నుంచి వలసపోయే వారి సంఖ్య పెరిగింది.హింసాత్మక మణిపూర్‌లో 23,000 మందికి పైగా పౌరులను రక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి : Breaking News:రాజస్థాన్‌లో కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం...నలుగురి మృతి

ఇండిగో,ఎయిర్‌ఏషియాతో సహా అనేక విమానయాన సంస్థలు ప్రయాణీకుల డిమాండ్‌తో తమ విమాన ప్రయాణ ఛార్జీలను పెంచాయి.సాధారణంగా ఇంఫాల్, కోల్‌కతా మధ్య విమాన ఛార్జీ వన్ వేలో ప్రయాణించే వ్యక్తికి రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు ఉండేది. ఇంఫాల్ నుంచి గౌహతి వెళ్లే విమానానికి కూడా ఇదే ఛార్జీ వర్తిస్తుంది.అయితే మే 3న మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి ఇంఫాల్ నుంచి కోల్‌కతాకు విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. ఈ మార్గంలో వన్‌వే ప్రయాణానికి ప్రస్తుత ఛార్జీ రూ.12,000 నుంచి రూ.25,000 వరకు పెరిగింది.అదే సమయంలో ఇంఫాల్ నుంచి గౌహతి వెళ్లేందుకు వన్‌వే టికెట్ ధర రూ.15,000కి పెరిగింది.జనం రద్దీతో ఇంఫాల్ నుంచి విమానాల సంఖ్యను పెంచారు.

Updated Date - 2023-05-08T12:50:18+05:30 IST