Kerala High Court: ‘ఆలయంపై కాషాయ జెండాలను అనుమతించం’

ABN , First Publish Date - 2023-09-15T04:16:39+05:30 IST

ఆలయం ఆవరణలో కాషాయ జెండాలు ఎగురవేయడానికిగానీ, కాషాయ తోరణాలు కట్టడానికిగానీ అనుమతించబోమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

Kerala High Court: ‘ఆలయంపై కాషాయ జెండాలను అనుమతించం’

కోచి, సెప్టెంబరు14: ఆలయం ఆవరణలో కాషాయ జెండాలు ఎగురవేయడానికిగానీ, కాషాయ తోరణాలు కట్టడానికిగానీ అనుమతించబోమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయాల పవిత్రత, ప్రశాంతత కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రాజకీయ చర్యలతో ఆలయాల స్థాయిని తగ్గించకూడదని పేర్కొంది. ముత్తుపిలక్కాడు శ్రీపార్థసారధి మందిరంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కాషాయ జెండాలు ఎగురవేయడానికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు భక్తులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌.వి. ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-15T04:16:39+05:30 IST