Gujarat Mass suicide: షాకింగ్...ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-10-28T18:39:05+05:30 IST
గుజరాత్ లోని సూరత్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిద్ధేశ్వర్ అపార్ట్‌మెంట్‌లో నివస్తున్న ఒక కుటుంబంలోని ఏడుగురు సభ్యులు సామూహిక ఆత్మహత్మకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి.
సూరత్: గుజరాత్ (Gujarat)లోని సూరత్(Surat)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిద్ధేశ్వర్ అపార్ట్‌మెంట్‌లో నివస్తున్న ఒక కుటుంబంలోని ఏడుగురు సభ్యులు సామూహిక ఆత్మహత్మ (Mass suicide)కు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. కుటుంబ పెద్దగా భావిస్తున్న మనీష్ సోలంకి అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆయన తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
కాగా, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నట్టు సూరత్ డీసీపీ రాకేష్ బరాట్ తెలిపారు. సూసైట్ నోట్ కూడా రాసి ఉందని, ఆ నోట్‌ను కూడా వెరిఫై చేశామని తెలిపారు. ఆర్థిక సమస్యలే సామూహిక ఆత్మహత్యలకు కారణంగా కనిపిస్తోందని, తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు. మనీష్ సోలంకి తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చిన తర్వాతే ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తోందని సూరత్ మేయర్ నిరంజన్ జాంజ్మేర తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలిస్తున్నట్టు చెప్పారు.