Sexual harassment : మహిళా ఐపీఎస్ కు లైంగిక వేధింపులు
ABN , First Publish Date - 2023-06-17T05:58:38+05:30 IST
మహిళా ఐపీఎస్ అధికారిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు శాంతి భద్రతల విభాగం మాజీ ప్రత్యేక డీజీపీ రాజేశ్ దాస్ (59)ను విల్లుపురం కోర్టు దోషిగా ప్రకటించింది.
తమిళనాట సీనియర్ ఐపీఎస్ కు శిక్ష
మాజీ ప్రత్యేక డీజీపీ రాజేశ్‌దా్‌సకు మూడేళ్ల జైలు
చెన్నై, జూన్16(ఆంధ్రజ్యోతి): మహిళా ఐపీఎస్ అధికారిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు శాంతి భద్రతల విభాగం మాజీ ప్రత్యేక డీజీపీ రాజేశ్ దాస్ (59)ను విల్లుపురం కోర్టు దోషిగా ప్రకటించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విఽధించింది. 2021 ఫిబ్రవరి 21న అప్పటి సీఎం ఎడప్పాడి పళనిస్వామి డెల్టా జిల్లాల్లో పర్యటించినప్పుడు శాంతి భద్రతల విభాగం ప్రత్యేక డీజీపీగా ఉన్న రాజేశ్‌దాస్ ఆయనకు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎడప్పాడి తన పర్యటనను ముగించుకుని నగరానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యలో రాజేశ్‌దాస్ తనతోపాటు వస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను సీఎం భద్రతపై చర్చించాలంటూ తన కారులో ఎక్కించుకున్నారు. ఇందుకు అప్పటి చెంగల్పట్టు డీఎస్పీ కన్నన సహకరించారు. లైంగిక వేధింపుల ఘటనపై ఆమె ఫిర్యాదు చేయడంతో విల్లుపురం సీబీసీఐడీ పోలీసులు ప్రత్యేక డీజీపీ, డీఎస్పీపై కేసులు నమోదు చేశారు. ఆయన అదే నెలలో సస్పెండయ్యారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన మద్రాస్ హైకోర్టుకు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌కు వెళ్లినా ఫలితంలేకపోయింది. లైంగిక వేధింపుల కేసుపై విల్లుపురం చీఫ్ జ్యుడీషియల్ మేజిసే్ట్రట్ పుష్పరాణి విచారణ జరిపారు. కేసు విచారణ గత ఏప్రిల్ 13న ముగియడంతో శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో రాజేశ్‌దాస్ దోషి అని ప్రకటించిన మేజిసే్ట్రట్.. ఆయనకు మూడే ళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు. ఈ కేసులో బెయిల్ పిటిషన సమర్పించగా మేజిసే్ట్రట్ ఆయనకు మంజూరు చేశారు.