Stop NCII.org : అశ్లీల ఫొటోలు తొలగించే స్టాప్‌ఎన్‌సీఐఐ.ఆర్గ్‌

ABN , First Publish Date - 2023-08-12T03:13:55+05:30 IST

సాంకేతికాభివృద్ధి ప్రయోజనాలకు తోడు నష్టాలను తోడ్కొని వస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఎఐ), ఫొటోషాప్‌ నైపుణ్యాల విజృంభణతో ‘రివెంజ్‌ పోర్న్‌’కు అవకాశం కలుగుతోంది. ఒక వ్యక్తి సమ్మతి లేకుండానే తన ఫొటోలను

Stop NCII.org : అశ్లీల ఫొటోలు తొలగించే స్టాప్‌ఎన్‌సీఐఐ.ఆర్గ్‌

సాంకేతికాభివృద్ధి ప్రయోజనాలకు తోడు నష్టాలను తోడ్కొని వస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఎఐ), ఫొటోషాప్‌ నైపుణ్యాల విజృంభణతో ‘రివెంజ్‌ పోర్న్‌’కు అవకాశం కలుగుతోంది. ఒక వ్యక్తి సమ్మతి లేకుండానే తన ఫొటోలను తీసుకుని లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్టు మార్చే పని ఎవరైనా చేయవచ్చు. దీనినే రివెంజ్‌ పోర్న్‌ అంటున్నారు. ఇమేజ్‌/వీడియోలతో ఇలా మానసిక హింసకు గురయ్యే వ్యక్తులను కాపాడేందుకు ప్రపంచంలో చాలా సంస్థలు తోడ్పాటును అందిస్తున్నాయి. ఇలాంటిదే యూకేకు చెందిన సంస్థ స్టాప్‌ఎన్‌సీఐఐ.ఆర్గ్‌. ఇది యూకేకు చెందిన ఒక లాభాపేక్ష రహిత సంస్థలో భాగంగా పనిచేస్తోంది. ఇక్కడ ఎన్‌సీసీఐ అంటే నాన్‌-కానెసెన్స్యుల్‌ ఇంటిమేట్‌ ఇమేజ్‌. సులువుగా చెప్పుకోవాలంటే ఒక వ్యక్తి సమ్మతి లేకుండా వారి ఫొటోను దుర్వినియోగం చేయడం అన్న మాట. ఈ సంస్థకు ఉన్న ఒక టూల్‌తో ఇంటిమేట్‌ ఇమేజ్‌ లేదంటే వీడియో నుంచి హ్యాష్‌(ముక్కలు చేసే)/డిజిటల్‌ ఫింగర్‌ప్రింట్‌ను జనరేట్‌ చేస్తుంది. అందుకు అల్గోరిథమ్స్‌ను ఉపయోగిస్తుంది. వాస్తవానికి డూప్లికేట్‌ కాపీలు అన్నింటికీ ఒకేరకమైన హ్యాష్‌ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని పార్టిసిపేటింగ్‌ కంపెనీలకు షేర్‌ చేస్తుంది. తద్వారా ఆన్‌లైన్‌లో షేర్‌ అయిన ఇమేజ్‌లను డిటెక్ట్‌ చేయడమే కాదు తొలగిస్తుంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, రెడ్డిట్‌, టిక్‌టాక్‌, బంబుల్‌, థ్రెడ్స్‌, ఓన్లీఫ్యాన్స్‌ తదితరాలన్నీ ఈ సంస్థకు టెక్నాలజీ భాగస్వాములు. ఇవికాకుండా బ్రేక్‌త్రూ, సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ వంటి గ్లోబల్‌ నెట్‌వర్క్‌ పార్టనర్స్‌ కూడా ఉన్నారు.

ఒక విషయం కేసు అయ్యేందుకు కొన్ని అర్హతలు ఉండాలి. ఫిర్యాదుకు ఇమేజ్‌ కారణం కావాలి. ఆ ఇమేజ్‌ యాక్సెస్‌ ఉండాలి. న్యూడ్‌, సెక్స్‌కు వీలుతీసే స్వభావం ఉండాలి. ఫిర్యాదుదారు వయస్సు 18 సంవత్సరాలు అంతకు మించి ఉండాలి. మరొకరి పక్షాన ఎవరూ ఫిర్యాదు చేయకూడదు. సదరు వ్యక్తి మాత్రమే ఫిర్యాదు చేయాలి. ఫార్టిసిపేటింగ్‌ కంపెనీలు హ్యాష్‌తో మ్యాచ్‌ అయితే తొలగిస్తాయి. కేసు నంబర్‌ ఉంటుంది. అలాగే కేసును ఏ సమయంలో అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

Updated Date - 2023-08-12T03:13:55+05:30 IST