Suburban trains: 12 బోగీలతో సబర్బన్ రైళ్లు
ABN , First Publish Date - 2023-01-11T09:54:32+05:30 IST
నగరం, శివారు ప్రాంతాలను కలిపేలా నడుపుతున్న సబర్బన్ రైళ్లకు(Suburban trains) 12 బోగీలు ఏర్పాటుకానున్నాయి. స్థానిక సెంట్రల్
పెరంబూర్(చెన్నై), జనవరి 10: నగరం, శివారు ప్రాంతాలను కలిపేలా నడుపుతున్న సబర్బన్ రైళ్లకు(Suburban trains) 12 బోగీలు ఏర్పాటుకానున్నాయి. స్థానిక సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి తాంబరం, చెంగల్పట్టు, తిరువళ్లూర్, అరక్కోణం, గుమ్మిడిపూండి, వేళచ్చేరి తదితర ప్రాంతాలకు ప్రతిరోజు 500 సబర్బన్ రైళ్లు నడుస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులతో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో రైళ్లు కిక్కిరిసి నడుస్తున్నాయి. అదే సమయంలో తాంబరం, చెంగల్పట్టు మధ్య కొద్ది రైళ్లు మినహా మిగిలిన రైళ్లే 9 బోగీలతో నడుస్తున్నాయి.ఇక, తిరువళ్లూర్, గుమ్మిడిపూండి మార్గాల్లో 60 శాతం రైళ్లు మాత్రమే 12 బోగీలతో నడుస్తుండగా, మిగిలిన వాటికి 9 బోగీలు ఉండడంతో రద్దీ సమయాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై దృష్టి సారించిన దక్షిణ రైల్వే ఇకపై అన్ని మార్గాల్లో 12 బోగీలతో సబర్బన్ రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు, రైళ్లకు తగినట్లు ఫ్లాట్‌ఫారం విస్తరణ పనులు కూడా ముగిశాయని అధికారులు తెలిపారు.