Supreme Court: సుప్రీంకోర్టు 'తారీక్‌పే తరీక్'గా మారకూడదు.. న్యాయవాదులకు సూచించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ABN , First Publish Date - 2023-11-03T13:12:20+05:30 IST
కోర్టు ముందుకు వచ్చిన కేసులను వాయిదా వేయాలని కోరటాన్ని సుప్రీం కోర్టు(Supreme Court) సీజేఐ జస్టిస్ చంద్రచూడ్(CJI Justice Chandrachud) తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసు వాయిదాలతో "తారీక్ పే తరీక్"(తేదీ తరువాత తేదీ)గా కోర్టు మారకూడదని ఉద్ఘాటించారు. గడిచిన రెండు నెలల్లో 3,688 కేసులను న్యాయవాదులు వాయిదా వేయాలని కోరారని వెల్లడించారు.
ఢిల్లీ: కోర్టు ముందుకు వచ్చిన కేసులను వాయిదా వేయాలని కోరటాన్ని సుప్రీం కోర్టు(Supreme Court) సీజేఐ జస్టిస్ చంద్రచూడ్(CJI Justice Chandrachud) తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసు వాయిదాలతో "తారీక్ పే తరీక్"(తేదీ తరువాత తేదీ)గా కోర్టు మారకూడదని ఉద్ఘాటించారు. గడిచిన రెండు నెలల్లో 3,688 కేసులను న్యాయవాదులు వాయిదా వేయాలని కోరారని వెల్లడించారు. వాయిదా వేస్తే కోర్టుపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని అన్నారు. ఇన్ని కేసులను వాయిదా వేయాలని కోరడం వల్ల సుప్రీంకోర్టు ఇమేజ్ దెబ్బతింటుందని న్యాయవాదులను(Lawyers) ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు.
వచ్చిన కేసులకు పరిష్కారాల్ని చూపేందుకు న్యాయవ్యవస్థ కృషి చేస్తోందని అన్నారు. ముందస్తు విచారణ తేదీల కేటాయింపు కోసం న్యాయవాదులు 2,361 కేసులను ప్రస్తావించారని, అయితే వాటిలో చాలా వరకు సంబంధిత బెంచ్‌ల ముందుకు వచ్చినప్పుడు వాయిదా వేయాలని అభ్యర్థించారని CJI తెలిపారు. ఈ టైంలో జాబితా చేసిన అంశాలంకంటే వాయిదా వేసిన కేసుల సంఖ్య దాదాపు రెండు మూడు రెట్లు ఎక్కువని తెలిపారు. నిజంగా.. అత్యవసరమైతే తప్పా కేసుల్ని వాయిదా వేయాలని కోరవద్దని బార్ సభ్యులను అభ్యర్థించారు.