Share News

ఎంపీల సస్పెన్షన్‌ అప్రజాస్వామికం: స్టాలిన్‌

ABN , Publish Date - Dec 15 , 2023 | 05:34 AM

పార్లమెంటులో గళమెత్తిన ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికమని తమిళనాడు ముఖ్యమంత్రి ..

ఎంపీల సస్పెన్షన్‌ అప్రజాస్వామికం: స్టాలిన్‌

చెన్నై, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో గళమెత్తిన ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు, ఎంపీలకు భద్రత కల్పించడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష సభ్యులైన డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్‌ ఎంపీలు జ్యోతిమణి, మాణిక్యం ఠాగూర్‌, సీపీఎం ఎంపీలు వెంకటేశన్‌, నటరాజన్‌ సహా 14 మందిని సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలను అణిచివేసే చర్యలు పార్లమెంటులో చేపట్టరాదని ఆయన గురువారం ‘ఎక్స్‌’లో హితవు పలికారు.

Updated Date - Dec 15 , 2023 | 05:40 AM