Tambaram: తాంబరం ఫ్లైవోవర్‌ పొడిగింపు

ABN , First Publish Date - 2023-01-30T08:47:21+05:30 IST

నగరానికి ప్రవేశద్వారంగా ఉన్న తాంబరం వద్ద ముడిచ్చూరు - జీఎస్టీ రోడ్డు, వేళచ్చేరి రహదారులను కలుపుతూ నిర్మించిన

Tambaram: తాంబరం ఫ్లైవోవర్‌ పొడిగింపు

చెన్నై, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): నగరానికి ప్రవేశద్వారంగా ఉన్న తాంబరం వద్ద ముడిచ్చూరు - జీఎస్టీ రోడ్డు, వేళచ్చేరి రహదారులను కలుపుతూ నిర్మించిన రహదారి వంతెనను కిలోమీటర్‌ మేర పొడిగించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దక్షిణాది జిల్లాలకు వెళ్లేవారు, ఆ జిల్లాల నుంచి నగరానికి తిరిగివచ్చేవారు తాంబరం మీదుగానే వెళ్తుంటారు. దీంతో తాంబరం(Tambaram) ప్రాంతంలో ఎల్లప్పుడూ రద్దీ ఉంటుంది. పెరంగళత్తూరులో ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు, సాయంత్రం ఐదు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితులలో ఈ రహదారి వంతెనను ఉత్తర దిశగా కి.లోమీటర్‌ దూరం వరకు పొడిగించేలా కొత్తగా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు తాంబరం ఎమ్మెల్యే రాజా(MLA Raja) ప్రతిపాదనను అక్కడి కార్పొరేషన్‌ ఆమోదించింది. త్వరలో వంతెనల రహదారి విస్తరణ కోసం ప్రభుత్వం తగినంత నిధులు విడుదల చేయనుంది. ఈ రహదారి వంతెన ఉత్తర దిక్కు పొడిగిస్తే ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని శాసనసభ్యుడు ఎస్‌ఆర్‌ రాజా తెలిపారు.

Updated Date - 2023-01-30T08:47:23+05:30 IST