Youtuber:యూట్యూబర్ డ్రైవింగ్ లైసెన్స్‌ని 10 ఏళ్ల పాటు రద్దు చేసిన కోర్టు.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-10-07T17:53:49+05:30 IST
తమిళనాడు ఫేమస్ యూట్యూబర్(Youtuber) టీటీఎఫ్ వాసన్(TTF Vasan)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. బైక్‌పై ప్రమాదకర రీతిలో చేసిన స్టంట్లను కోర్టు తీవ్రంగా తప్పుబడుతూ.. వాసన్ డ్రైవింగ్ లైసెన్స్(Driving License)ని 10 ఏళ్ల పాటు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
చెన్నై: తమిళనాడు ఫేమస్ యూట్యూబర్(Youtuber) టీటీఎఫ్ వాసన్(TTF Vasan)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. బైక్‌పై ప్రమాదకర రీతిలో చేసిన స్టంట్లను కోర్టు తీవ్రంగా తప్పుబడుతూ.. వాసన్ డ్రైవింగ్ లైసెన్స్(Driving License)ని 10 ఏళ్ల పాటు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. వివరాలు.. టీటీఎఫ్ వాసన్ అనే యూట్యూబర్ బైక్ స్టంట్లు, రోడ్ ట్రిప్పులకు సంబంధించిన వీడియోలు తీసి యూట్యూబ్(Youtube)లో అప్ లోడ్ చేస్తుంటాడు. సెప్టెంబర్ 17న ఓ రోడ్ ట్రిప్ లో భాగంగా అతను చెన్నై-వేలూరు(Chennai - Veluru) హైవేపై స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు.
దమాల్ సమీపంలోకి రాగానే అతని బైక్(Bike) అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. హెల్మెట్, రేస్ సూట్ వేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. చేతికి ఫ్రాక్చర్ అయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అదే టైంలో కాంచిపురం సెషన్స్ కోర్టు(Sessions Court) అతని బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది. దీంతో వాసన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. పశువుల మంద అడ్డురావడంతో తాను సడెన్ బ్రేక్ వేశానని కోర్టుకు చెప్పాడు. విచారణ చేపట్టిన కోర్టు నిందితుడిని మందలించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి యువతను పెడదారిలో నడిచేలా చేసినందుకుగానూ 10 ఏళ్ల పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు తీర్పునిచ్చింది. వాసన్ కు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో గణనీయంగా ఫాలోవర్లు ఉన్నారు.