Tamils are the Saraths : మూడుసార్లూ తమిళులే సారథులు
ABN , First Publish Date - 2023-08-24T03:33:50+05:30 IST
ఇస్రో ఇప్పటి వరకు మూడుసార్లు నిర్వహించిన మూడు ‘చంద్రయాన్’ ప్రాజెక్టులలోనూ కీలక పాత్ర వహించింది ముగ్గురు తమిళులు కావడం విశేషం. చంద్రుడి ఉపరితలంపై ప్లాన్ చేసిన సాఫ్ట్ ల్యాండింగ్, ప్రొపల్షన్ మాడ్యూల్,
చెన్నై, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఇస్రో ఇప్పటి వరకు మూడుసార్లు నిర్వహించిన మూడు ‘చంద్రయాన్’ ప్రాజెక్టులలోనూ కీలక పాత్ర వహించింది ముగ్గురు తమిళులు కావడం విశేషం. చంద్రుడి ఉపరితలంపై ప్లాన్ చేసిన సాఫ్ట్ ల్యాండింగ్, ప్రొపల్షన్ మాడ్యూల్, సైంటిఫిక్ పేలోడ్ వంటి అంశాల్లో కీలకపాత్ర పోషించింది కూడా తమిళులే కావడం మరింత విశేషం. ఇస్రో 2008లో చేపట్టిన చంద్రయాన్-1 ప్రాజెక్టుకు ‘మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన శాస్త్రవేత్త మయిల్‌స్వామి అన్నాదురై నేతృత్వం వహించారు. 1982లో ఇస్రోలో చేరిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. చంద్రయాన్-1కు ఆయనే ప్రాజెక్టు డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించారు. భారత్ తొలిసారిగా చంద్రుడిపై కాలు మోపడంలో ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. అందుకే ఆయన్ని ‘మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా దేశం పిలుచుకుంటోంది. అనంతరం 2008లో ప్రారంభమైన చంద్రయాన్-2కి కూడా ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు.
చంద్రయాన్-2కు చెన్నై మహిళ నేతృత్వం
2019లో చంద్రయాన్ 2 మిషన్‌కు ఎం వనిత నేతృత్వం వహించారు. డిజైన్ ఇంజనీర్ అయిన ఆమె ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 3దశాబ్దాలుగా ఇస్రోలో పని చేస్తున్న ఆమె 1964లో జన్మించారు. ఇస్రోలో కార్టో శాట్-1, ఓషన్ శాట్-2 సహా పలు ఉపగ్రహాలకు డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు. చంద్రయాన్ 2 ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇస్రోలో ఇంటర్ ప్లాంటరీ మిషన్‌కు నేతృత్వం వహించిన తొలి మహిళ ఆమే.
విల్లుపురం వాసి నేతృత్వంలో...
చంద్రయాన్-3 మిషన్‌కు వీరముత్తువేల్ నేతృత్వం వహించారు. విల్లుపురానికి చెందిన ఆయన 1976లో జన్మించారు. చంద్రయాన్ 2 విఫలమయ్యాక చంద్రయాన్ 3కి ఆయన్ని ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించారు. అప్పటి వరకూ ఆయన ఇస్రోలో స్పేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఆఫీ్‌సకి డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆది నుంచి చంద్రయాన్ 3 ప్రాజెక్టు పట్ల అచంచల విశ్వాసమున్న ఆయన నేతృత్వంలోని బృందం అనుకున్నది సాధించిందని విల్లుపురం జిల్లా వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.