Teapot : ‘ది ఇగోయిస్ట్‌’ టీపాట్‌.. ఇదే కాస్ట్‌లీ గురూ!

ABN , First Publish Date - 2023-08-11T03:59:29+05:30 IST

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌. ‘ది ఇగోయి్‌స్ట’గా పిలువబడే దీనిని బ్రిటన్‌కు చెందిన ఎన్‌ సేథియా ఫౌండేషన్‌, లండన్‌లోని న్యూబీ టీస్‌ సంయుక్తంగా తయారుచేయించాయి. ఇటాలియన్‌ అభరణాల వ్యాపారి పుల్వి యో

Teapot : ‘ది ఇగోయిస్ట్‌’ టీపాట్‌.. ఇదే కాస్ట్‌లీ గురూ!

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌. ‘ది ఇగోయి్‌స్ట’గా పిలువబడే దీనిని బ్రిటన్‌కు చెందిన ఎన్‌ సేథియా ఫౌండేషన్‌, లండన్‌లోని న్యూబీ టీస్‌ సంయుక్తంగా తయారుచేయించాయి. ఇటాలియన్‌ అభరణాల వ్యాపారి పుల్వి యో స్కావియా ఈ టీపాట్‌ను అద్భుతంగా రూపొందించారు. దీనిని 18 క్యారట్ల బంగారంతో తయారు చేసి, చుట్టూ వజ్రాలను అమర్చారు. అలాగే మధ్యలో 6.67 క్యారట్ల రూబీ(కెంపు)లను అమర్చారు. ఈ టీపాట్‌ తయారీలో మొత్తం 1658 వజ్రాలు, 386 థాయ్‌, బర్మీస్‌ కెంపులు ఉపయోగించారు. 2016లోనే దీని విలువ 3 మిలియన్‌ డాలర్లు(రూ.24 కోట్లు)గా ఉంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నిస్‌ బుక్‌ తాజాగా గుర్తించింది. టీపాట్‌ ఫొటోలతోపాటు దాని వివరాలను ఎక్స్‌(ట్విటర్‌)లో గురువారం ట్వీట్‌ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Updated Date - 2023-08-11T03:59:29+05:30 IST