Vande Metro : ఈ ఏడాదే ‘వందే మెట్రో’ రైళ్ల రాక!

ABN , First Publish Date - 2023-04-15T04:01:35+05:30 IST

దేశంలో అనేక ప్రాంతాల్లో సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆవిష్కరించిన రైల్వేశాఖ స్వల్ప దూర నగరాలను కలిపే వందే మెట్రో రైళ్లను ప్రవేశ పెట్టనుంది. ఈ ఏడాది డిసెంబరులో

Vande Metro : ఈ ఏడాదే ‘వందే మెట్రో’ రైళ్ల రాక!

డిసెంబరులో పట్టాలపైకి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14: దేశంలో అనేక ప్రాంతాల్లో సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆవిష్కరించిన రైల్వేశాఖ స్వల్ప దూర నగరాలను కలిపే వందే మెట్రో రైళ్లను ప్రవేశ పెట్టనుంది. ఈ ఏడాది డిసెంబరులో వీటిని పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్టవ్‌ ఈ విషయమై శుక్రవారం మాట్లాడుతూ 100 కి.మీ లోపు దూరం ఉన్న నగరాలకు ఇవి సేవలందిస్తాయని చెప్పారు. వందే భారత్‌ రైళ్లకు ఇవి భిన్నంగా ఉంటాయని.. వందే భారత్‌ రోజుకు ఒకసారి నడిస్తే.. ఇవి రోజులో అనేకసార్లు (4,5 సార్లు) నడుస్తాయని వెల్లడించారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా, తక్కు వ రేట్లలో అందుబాటులో ఉంటాయన్నారు. వందే భారత్‌ రైళ్లు విజయవంతం కావడంతో ప్రధాని మంత్రి మోదీ రైల్వే మంత్రిత్వ శాఖను వందే మెట్రో రైళ్లకు రూపకల్పన చేయాలని కోరారని వివరించారు. అదీ ఈ ఏడాదే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వాటిని అందుబాటులోకి తేవాలని తమకు లక్ష్యం విధించారని మంత్రి చెప్పారు. యూర్‌పలో రీజనల్‌ రైళ్లుగా ఇవి పేరొందాయని వెల్లడించారు.

Updated Date - 2023-04-15T04:01:35+05:30 IST