Earthquake Alerts : అరగంట వ్యవధిలో మూడు భూకంపాలు.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు..
ABN , First Publish Date - 2023-07-21T08:07:09+05:30 IST
ఒకవైపు దేశాన్ని వర్షాలు ముంచెత్తుతుంటే.. మరోవైపు భూకంపాలు భయం పుట్టిస్తున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున మూడు భూకంపాలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మూడు భూకంపాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలో సంభవించాయి. మొదటి భూకంపం ఉదయం 4:09:38 గంటలకు సంభవించగా.. దాని తీవ్రత 4.4 గా ఉంది. రెండవ భూకంపం.. 04:22:57 గంటలకు సంభవించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. మూడవసారి 4.25:33 గంటలకు.. 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
రాజస్థాన్ : ఒకవైపు దేశాన్ని వర్షాలు ముంచెత్తుతుంటే.. మరోవైపు భూకంపాలు భయం పుట్టిస్తున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున మూడు భూకంపాలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మూడు భూకంపాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలో సంభవించాయి. మొదటి భూకంపం ఉదయం 4:09:38 గంటలకు సంభవించగా.. దాని తీవ్రత 4.4 గా ఉంది. రెండవ భూకంపం.. 04:22:57 గంటలకు సంభవించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. మూడవసారి 4.25:33 గంటలకు.. 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
జైపూర్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప ప్రకంపనల కారణంగా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకూ తెలియరాలేదు. అరగంట వ్యవధిలో మూడు భూకంపాలు సంభవించడంపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పందిస్తూ.. ‘‘జైపూర్‌తో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో భూకంపం సంభవించింది. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను!’’ అని పేర్కొన్నారు.