Toll Tax: ఏప్రిల్ 1 నుంచి టోల్ ట్యాక్స్ పెంపు...వాహనచోదకులపై మరింత భారం
ABN , First Publish Date - 2023-03-30T10:21:45+05:30 IST
కొన్ని జాతీయ రహదారుల్లో ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నుంచి టోల్ ట్యాక్స్ పెరగనుంది...
ముంబయి: కొన్ని జాతీయ రహదారుల్లో ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నుంచి టోల్ ట్యాక్స్ పెరగనుంది.(Toll Tax Revised)దేశవ్యాప్తంగా టోల్ పన్ను రేట్ల సవరణ ప్రక్రియలో భాగంగా ముంబయి-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ ట్యాక్స్ ఏప్రిల్ 1వతేదీ నుంచి పెంచుతూ జాతీయ రహదారుల విభాగం అధికారులు నిర్ణయం తీసుకున్నారు.దీంతో ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో(Mumbai-Pune Expressway) డ్రైవింగ్ ఖరీదైనదిగా మారనుంది.(Become Expensive)ముంబయి-పూణె ఎక్స్‌ప్రెస్‌వే పై ఏప్రిల్ 1వతేదీ నుంచి(From April 1) టోల్ ట్యాక్స్ 18 శాతం పెంచారు.దేశవ్యాప్తంగా హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ ట్యాక్స్ పెంచుతూ అధికారులు తుది ప్రకటన చేయనున్నారు. దీంతో జాతీయ రహదారులపై ప్రయాణం మరింత ఖరీదైనదిగా మారనుంది.
ఇది కూడా చదవండి : Virat Kohli: నా ఫోన్ వమికా ఫొటోలతో నిండింది...కోహ్లీ వెల్లడి
దేశంలోని మొట్టమొదటి యాక్సెస్-నియంత్రిత హైవే ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి వినియోగదారుల నుండి 18 శాతం అధిక టోల్ పన్నును వసూలు చేస్తుందని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) అధికారులు తెలిపారు. 2004 ఆగస్టు 9 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా టోల్ ట్యాక్స్ వార్షికంగా ఆరు శాతం పెంచినప్పటికీ, ప్రతి మూడేళ్ల తర్వాత 18 శాతం చొప్పున అమలు చేస్తామని సీనియర్ అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి : Pope Francis: పోప్ ఫ్రాన్సిస్‌కు శ్వాసకోశ సమస్యలు...ఆసుపత్రిలో చేరిక
కార్లు, జీపుల వంటి నాలుగు చక్రాల వాహనాలకు ప్రస్తుతం ఉన్న టోల్ ట్యాక్స్ రూ.270కి బదులుగా కొత్త టోల్ రూ.320, మినీ బస్సు, టెంపో వంటి వాహనాలకు ప్రస్తుతం రూ.420కి బదులు రూ.495కు పెంచామని ఓ అధికారి తెలిపారు.టూ-యాక్సిల్ ట్రక్కుల టోల్ ప్రస్తుతం రూ.585 నుంచి రూ.685కి పెరగనుంది.బస్సులకు రూ.797 నుంచి రూ.940కి పెరగనుంది.త్రీయాక్సిల్ ట్రక్కులకు రూ.1,380కి బదులుగా రూ.1,630, మల్టీ-యాక్సిల్ ట్రక్కులు, మెషినరీ వాహనాలకు ప్రస్తుతం రూ.1,835కి బదులుగా రూ.2,165 చెల్లించాల్సి ఉంటుంది.దేశంలోని అన్ని ఇతర హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు ఇప్పుడు పెరిగిన టోల్‌ను వసూలు చేస్తాయని అధికారులు చెప్పారు. ఇంధన ధరల పెంపుతో అవస్థలు పడుతున్న వాహనచోదకులకు టోల్ ట్యాక్స్ పెంచడం వల్ల మరింత భారం పడనుంది.