Onion Prices Surge: టమాటా ధర తగ్గింది కానీ ఉల్లి ధర వచ్చే నెలలో ఎంతకెళుతుందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-08-28T16:00:19+05:30 IST

ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబరులో కిలో ఉల్లిపాయ రూ.70కి చేరే అవకాశం ఉందని క్రెడిట్‌ రేటింగ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (క్రిసిల్‌) ఇప్పటికే అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో ఉల్లి పంట తక్కువగా వేయడం కూడా ఓ కారణమని క్రిసిల్‌ పేర్కొంది.

Onion Prices Surge: టమాటా ధర తగ్గింది కానీ ఉల్లి ధర వచ్చే నెలలో ఎంతకెళుతుందో తెలిస్తే..

ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబరులో కిలో ఉల్లిపాయ రూ.70కి చేరే అవకాశం ఉందని క్రెడిట్‌ రేటింగ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (క్రిసిల్‌) అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో ఉల్లి పంట తక్కువగా వేయడం కూడా ఓ కారణమని క్రిసిల్‌ పేర్కొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలు స్థిరీకరించే చర్యలకు ఉపక్రమించింది. ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే దిశగా ఆదేశాలు జారీ చేసింది. ఒకప్పుడు ఉల్లి ధరలు పెరుగుదలకు ప్రభుత్వాలు పడిపోయినంత పనయ్యేది. అప్పటి నుంచీ కేంద్ర ప్రభుత్వం బఫర్‌ స్టాకును ఉంచుతోంది. సుమారు 3 లక్షల టన్నుల బఫర్‌ స్టాకు నిల్వలు అందుబాటులో ఉండేలా చూస్తోంది.


ఇప్పుడు క్రిసిల్‌ హెచ్చరికలు, ఎన్నికల వేళ దగ్గర పడుతుండడంతో అదనంగా మరో 2 లక్షల టన్నులు కొని నిల్వ చేయాలని నేషనల్‌ కోఆపరేటివ్‌ కన్జ్యూమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌సీసీఎఫ్‌ఐఎల్‌)కి సూచించింది. దీంతో ఆ సంస్థ రంగంలోకి దిగింది. పెరుగుదల్లో అదుపు లేకపోతే బఫర్‌ నిల్వలను మార్కెట్లలోకి పంపించాలని యోచిస్తోంది. అలాగే ఉల్లి ఎగుమతులకు అడ్డుకట్ట వేసి స్థానికంగా నిల్వలు పెంచడానికి ఉల్లి ఎగుమతులపై సుంకాన్ని 40 శాతానికి పెం చింది. కాగా భారత్‌లో ఏడాదికి దాదాపు 3 కోట్ల టన్నుల ఉల్లి వినియోగిస్తున్నారు.

Price-Of-Onions.gif

గత కొన్ని రోజులుగా లోకల్‌ మార్కెట్‌ అందుకోవడంతో టమాటా ధరలు ఇప్పుడిప్పుడే దిగొచ్చాయి. ఆ తరువాత మిర్చి ధర కూడా టాప్‌గేర్‌లో పరుగెత్తింది. బహిరంగ మార్కెట్లు, రైతుబజార్లలోనూ కిలో రూ.120-రూ.140లకు విక్రయించారు. ఆ తర్వాత రెండు వారాల కిందట వంకాయలు భయపెట్టాయి. దొమ్మేరు రకం వంకాయలు కిలో రూ.100 దాటి అమ్మకాలు జరిగాయి. ఇక ఇప్పుడు ఉల్లిపాయల వంతు వచ్చింది. వారం కిందటి వరకూ రూ.20ల మధ్య ఊగిసలాడిన ఉల్లి ధర ప్రస్తుతం రూ.28లకు చేరింది. గత వారంగా ఇదే ధర ఉంది.

Updated Date - 2023-08-28T16:06:57+05:30 IST