Monsoon Session : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి
ABN , First Publish Date - 2023-07-01T13:11:29+05:30 IST
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శనివారం ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సమావేశాల్లో సత్ఫలితాలు ఇచ్చే చర్చలు జరగడానికి కృషి చేయాలని అన్ని పార్టీలను కోరారు. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు జరుగుతాయని తెలిపారు. నూతన పార్లమెంటు భవనంలో జరిగే మొదటి సమావేశాలు ఇవే.
న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శనివారం ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సమావేశాల్లో సత్ఫలితాలు ఇచ్చే చర్చలు జరగడానికి కృషి చేయాలని అన్ని పార్టీలను కోరారు. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు జరుగుతాయని తెలిపారు. నూతన పార్లమెంటు భవనంలో జరిగే మొదటి సమావేశాలు ఇవే.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మే 28న నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు (UCC Bill)ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రభుత్వ సవరణ ఆర్డినెన్స్‌కు చట్ట రూపం ఇచ్చేందుకు ఓ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు కొత్త పార్లమెంటు భవనంలో కార్యాలయాలను కేటాయించారు. ముఖ్యమైన డిపార్ట్‌మెంట్ల కార్యాలయాలను కూడా తరలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Maharashtra : మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో అగ్ని ప్రమాదం.. 25 మంది మృతి..
Jaishankar and Shashi Tharoor : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై శశి థరూర్ వ్యాఖ్యలు