G20 Summit: భారత్ వేదికగా ముగిసిన జీ20 సదస్సుపై అమెరికా స్పందన ఇదే.. రిపోర్టర్లు ప్రశ్నించగా...
ABN , First Publish Date - 2023-09-12T13:02:06+05:30 IST
భారత్ వేదికగా జరిగిన జీ20 సదస్సు (G20 Summit) విజయవంతమైందని ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే పలు దేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేయగా తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. జీ20 సదస్సు ‘సంపూర్ణ విజయం’ (absolute success) అని అమెరికా కొనియాడింది.
వాషింగ్టన్: భారత్ వేదికగా జరిగిన జీ20 సదస్సు (G20 Summit) విజయవంతమైందని ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే పలు దేశాల అధినేతలు హర్షం వ్యక్తం చేయగా తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. జీ20 సదస్సు ‘సంపూర్ణ విజయం’ (absolute success) అని అమెరికా కొనియాడింది. ఈ మేరకు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం ఒక ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు. ‘‘ ఇది (జీ20 సదస్సు) సంపూర్ణంగా విజయవంతమైందని మేము విశ్వసిస్తున్నాం. జీ20 అనేది ఒక పెద్ద సంస్థ. ఇందులో ఒక సభ్యదేశంగా ఉంది. చైనా కూడా సభ్యదేశం’’ అని వ్యాఖ్యానించారు. జీ20 సదస్సు ఫలవంతంగా ముగిసిందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా స్పందించారు.
న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు రష్యా గైర్హాజరవ్వడంపై ప్రశ్నించగా.. ‘‘ సభ్యదేశాలకు విభిన్న ఆలోచనలు ఉంటాయి. ప్రాదేశిక సమగ్రత, సౌభాతృత్వాలను గౌరవిస్తూ జీ20 ప్రకటన చేయగలిగిందని మేము నమ్ముతున్నాం. నిబంధనలను ఉల్లంఘించకూడదనేది చాలా ముఖ్యమైన ప్రకటన. ఎందుకంటే రష్యా ‘ఉక్రెయిన్ దాడి’ వెనుక ఉన్న ఆలోచన ఇదే. కాబట్టి జీ20 ప్రకటన చాలా ముఖ్యమైనది’’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు. న్యూక్లియర్ ఆయుధాల వినియోగం లేదా వాటి పేరు చెప్పి బెదిరించడం ఆమోదయోగ్యంకాదని అన్నారు.