Usain Bolt: బోల్ట్‌కు టోకరా!
ABN , First Publish Date - 2023-01-20T02:08:37+05:30 IST
జమైకాకు చెందిన ప్రపంచ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ఆర్థిక మోసానికి గురై భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు.
పరుగుల వీరుడి ఖాతాలోని
రూ.103 కోట్లు మాయం
మదుపు పెట్టిన కంపెనీలో
భారీ ఆర్థిక మోసం
కింగ్స్టన్, జనవరి 19: జమైకాకు చెందిన ప్రపంచ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ఆర్థిక మోసానికి గురై భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. ఆయన కోల్పోయిన మొత్తం 1.2 కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.103 కోట్లు). పదవీవిరమణ-జీవితకాల సేవింగ్స్ కింద జమైకా రాజధాని కింగ్స్టన్లోని స్టాక్స్ అండ్ సెక్యురిటీస్ లిమిటెడ్ (ఎస్‌ఎ్‌సఎల్) అనే పెట్టుబడుల సంస్థలో బోల్ట్ ఈ డబ్బులను మదుపు చేశారు. ఇప్పుడు చూస్తే ఆయన ఖాతాలో 12 వేల డాలర్లు (రూ.9.76 లక్షలు) మాత్రమే ఉన్నాయి. ఈ సొమ్మును కంపెనీ తిరిగి జమ చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బోల్ట్ తరఫు న్యాయవాది లింటన్.పి. గోర్డ్డాన్ హెచ్చరించారు. కంపెనీలో జరిగిన ఆర్థిక మోసానికి సంబంధించిన విషయాలను ఆయ న ఫార్చూన్ మేగజైన్ అనే పత్రికతో ఫోన్లో పంచుకున్నారు. పోయిన డబ్బు తిరిగి ఖాతాలోకి చేరి, మొత్తం వ్యవహారం సుఖాంతం అవుతుందన్న ఆశాభావంతో ఉన్నామన్నారు.