Vande Bharat Train: చెన్నై-కోవై మధ్య వందే భారత్‌ రైలు

ABN , First Publish Date - 2023-02-07T10:06:46+05:30 IST

చెన్నై-కోయంబత్తూర్‌(Chennai-Coimbatore) మధ్య త్వరలో వందే భారత్‌ సేవలను ప్రారంభించనున్నట్లు దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ఎన్‌.సింగ్‌

Vande Bharat Train: చెన్నై-కోవై మధ్య వందే భారత్‌ రైలు

- లోకల్‌ రైళ్లలో బోగీల పెంపు

పెరంబూర్‌(చెన్నై), ఫిబ్రవరి 6: చెన్నై-కోయంబత్తూర్‌(Chennai-Coimbatore) మధ్య త్వరలో వందే భారత్‌ సేవలను ప్రారంభించనున్నట్లు దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ఎన్‌.సింగ్‌ ప్రకటించారు. శనివారం దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఈ ఆర్ధిక సంవత్సరంలో కొత్త రైలుమార్గాల నిర్మాణానికి రూ.1,057.90 కోట్లు, జంట రైలుమార్గాల నిర్మాణానికి రూ.1,321.28 కోట్లను కేంద్రం కేటాయించిందన్నారు. దక్షిణ రైల్వే కు గత ఆర్ధిక సంవత్సరంలో రూ.8,100 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. చెన్నై సెంట్రల్‌, ఆవడి, తాంబరం, కోయంబత్తూర్‌, కుంభకోణం, తిరునల్వేలి తదితర 12 రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చెన్నై-కోవై మధ్య వందేభారత్‌ రైలు నడిపేందుకు రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించామని, త్వరలోనే ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. నగరం నుంచి శివారు ప్రాంతాలకు నడుపుతున్న లోకల్‌ రైళ్లలో ప్రస్తుతముున్న 12 బోగీలకు అదనంగా మరో రెండు బోగీలు చేర్చనున్నామని, చెన్నై సెంట్రల్‌, అరక్కోణం మధ్య నడుపుతున్న లోక్‌ల్‌ రైళ్లకు బోగీల సంఖ్యను 12కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2023-02-07T10:06:48+05:30 IST