Swara Vs Sadhvi : స్వర భాస్కర్ పెళ్లిపై సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-02-22T18:41:14+05:30 IST
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhasker) పెళ్లిపై విశ్వ హిందూ పరిషత్ (VHP) నేత సాధ్వి ప్రాచి (Sadhvi Prachi) సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhasker) పెళ్లిపై విశ్వ హిందూ పరిషత్ (VHP) నేత సాధ్వి ప్రాచి (Sadhvi Prachi) సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి ముందు ఓసారి ఫ్రిజ్ చూసుకోవలసిందన్నారు. ఇటీవల ఆఫ్తాబ్ పూనావాలా ఓ యువతిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి, ఫ్రిజ్‌లో పెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
స్వర భాస్కర్ ఫిబ్రవరి 16న ఇచ్చిన ట్వీట్‌లో, ఫహద్ అహ్మద్‌తో తన పెళ్లి గురించి తెలిపారు. ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సాధ్వి ప్రాచి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, స్వర భాస్కర్ మొదటి నుంచి హిందూ మతానికి వ్యతిరేకేనని చెప్పారు. హిందువు కాని వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకుంటుందని తాను మొదటి నుంచి అనుకునేదాన్నని తెలిపారు. చివరికి ఆమె ఓ ముస్లింను పెళ్లాడిందన్నారు. బహుశా స్వర భాస్కర్ ఇటీవలి వార్తలపై దృష్టి పెట్టలేనట్లుందన్నారు. శ్రద్ధ వాకర్‌ను ఆఫ్తాబ్ హత్య చేసి, ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికినట్లు వచ్చిన వార్తలను ఆమె గమనించలేనట్లు కనిపిస్తోందన్నారు. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆమె ఓసారి ఫ్రిజ్‌లోకి చూసి ఉండవలసిందన్నారు. పెళ్లి చేసుకోవడమనేది ఆమె వ్యక్తిగత నిర్ణయమేనని, శ్రద్ధకు జరిగినది స్వరకు కూడా జరగవచ్చునన్నారు.
ఇవి కూడా చదవండి :
MCD Mayor Election: మేయర్ పీఠం ఆప్‌కే.. డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ గెలుపు