రాజ్యసభలో విజిటర్స్ నినాదాలు..చర్యలకు డిమాండ్
ABN , First Publish Date - 2023-09-25T03:08:06+05:30 IST
సెప్టెంబరు 21న రాజ్యసభ గ్యాలరీలో కూర్చుని రాజకీయ నినాదాలు ఇచ్చిన సందర్శకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆదివారం లేఖ రాశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: సెప్టెంబరు 21న రాజ్యసభ గ్యాలరీలో కూర్చుని రాజకీయ నినాదాలు ఇచ్చిన సందర్శకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆదివారం లేఖ రాశారు. కాంగ్రెస్ చీఫ్ విప్ అయిన ఆయన రాజ్యసభలో చోటు చేసుకున్న ఈ ఘటనపై తీవ్ర విచారం, ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు సందర్శకులు పాటించాల్సిన నిబంధనలు రూల్ 264లో స్పష్టంగా ఉన్నాయన్నారు. దానికి విరుద్ధంగా వారి ప్రవర్తన ఉందన్నారు. ఏకంగా 50 మందికిపైగా సందర్శకులు నినాదాలు ఇవ్వడం చాలా విచారకరమన్నారు.