మతసామరస్యం వెల్లివిరిసిన వేళ...
ABN , First Publish Date - 2023-07-09T01:56:15+05:30 IST
మత సామరస్యానికి చక్కటి నిర్వచనమిచ్చే సంఘటన ఇది. కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా బానాపురలో ముస్లింల కోసం హిందువులు
బెంగళూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మత సామరస్యానికి చక్కటి నిర్వచనమిచ్చే సంఘటన ఇది. కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా బానాపురలో ముస్లింల కోసం హిందువులు మసీదు నిర్మాణం చేపట్టగా శనివారం ఆ ప్రార్థనా మందిరాన్ని హిందూ స్వామిజీ ఒకరు ప్రారంభించారు. బానాపురలో ఐదే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. ప్రార్థనలు చేసుకునేందుకు వీరు పక్క గ్రామంలోని మసీదుకు వెళ్లాల్సి వచ్చేది. దీన్ని గమనించిన స్థానిక హిందువులు మసీదును నిర్మించేందుకు ముందుకొచ్చారు. కులమతాలకు అతీతంగా గ్రామస్థులు కలిసి మసీదును నిర్మించారు. దీంతో హిందువులకు కృతజ్ఞతలు చెప్పేందుకు గవిమఠానికి చెందిన సిద్దేశ్వర స్వామితోనే మసీదును ప్రారంభింపజేయాలని ముస్లింలు తీర్మానించారు. మసీదును ప్రారంభించిన అనంతరం స్వామిజీ ప్రసంగిస్తూ మతాలన్నీ మానవత్వాన్ని పరిమళింపజేయాలన్నారు.