ఫిరంగి దళాల్లోకి మహిళలు

ABN , First Publish Date - 2023-04-30T03:49:07+05:30 IST

భారత ఆర్మీ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరంగి దళం(Artillery)లో తొలిసారి మహిళలను

ఫిరంగి దళాల్లోకి మహిళలు

న్యూఢిల్లీ: భారత ఆర్మీ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిరంగి దళం(Artillery)లో తొలిసారి మహిళలను నియమించారు. చెన్నై(Chennai) లోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (Officers Training Academy(OTA)లో శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు మహిళా అధికారులను ఫిరంగి దళంలోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురికి చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి పోస్టింగ్‌ ఇచ్చా రు. మరో ఇద్దరిని పాకిస్థాన్‌ సరిహద్దు(Pakistan Borders)ల్లో విధులకు పంపారు.

చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మహిళా అధికారులు విధుల్లో చేరారు. ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేరిన వారిలో మహిళా అధికారులు లెఫ్టినెంట్ మెహక్ సైనీ, లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెఫ్టినెంట్ పియస్ ముద్గిల్ ఉన్నారు.

Updated Date - 2023-04-30T03:49:07+05:30 IST