Samiran Gupta resign:ఎక్స్‌కు కీలక ఉద్యోగి రాజీనామా.. కేంద్ర ప్రభుత్వ ఆగ్రహమే కారణమా?

ABN , First Publish Date - 2023-09-23T12:57:37+05:30 IST

ప్రసిద్ధ సోషల్ మీడియా కంపెనీ ఎక్స్(x)లో టాప్ పొజీషన్ లో ఉన్న ఓ వ్యక్తి రాజీనామా(Resign) చేయడం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. భారత్, దక్షిణాసియా పాలసీ హెడ్ గా ఉన్న సమీరన్ గుప్తా(Samiran Gupta) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Samiran Gupta resign:ఎక్స్‌కు కీలక ఉద్యోగి రాజీనామా.. కేంద్ర ప్రభుత్వ ఆగ్రహమే కారణమా?

ఢిల్లీ: ప్రసిద్ధ సోషల్ మీడియా కంపెనీ ఎక్స్(x)లో టాప్ పొజీషన్ లో ఉన్న ఓ వ్యక్తి రాజీనామా(Resign) చేయడం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. భారత్, దక్షిణాసియా పాలసీ హెడ్ గా ఉన్న సమీరన్ గుప్తా(Samiran Gupta) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో 2024లో లోక్ సభ ఎన్నికలు(Lokh Sabha Elections) జరగనున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం సందేహాల్ని రేకెత్తిస్తోంది.


ఫిబ్రవరి 2022లో ఎక్స్ లో చేరిన ఆయన కంటెంట్ సంబంధిత విధాన సమస్యలు, న్యూ పాలసీలు, కంపెనీ సంబంధాలు బలపర్చడం తదితర బాధ్యతలను ఆయన నిర్వహించేవారు. గవర్నమెంటుకు, పొలిటికల్ పార్టీలకు మధ్య అనుసంధానకర్తగా ఉంటూ హెడ్ గా పని చేసేవారు.

కంటెంట్ తొలగించలేదనే కోపమా?

ఎక్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంచిన కొంత కంటెంట్ తో పాటు మరో కేటగిరీకి చెందిన కంటెంట్ ని తీసేయాలని గతంలో కేంద్రం(BJP Govt) ఎక్స్ ని ఆదేశించింది. ఆ ఆదేశాలు పాటించడంలో ఎక్స్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇలాంటి కంటెంట్ ఎన్నికల సమయంలో మరింతగా వ్యాపిస్తుందని అంచనా వేసిన సమీరన్ ఆ తలనొప్పి ఎందుకు అనుకున్నారేమో ఏకంగా అంత పెద్ద పదవిని సునాయాసంగా వదిలేశారు. ఇదే మార్కెట్ వర్గాల్లో, పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది.

Updated Date - 2023-09-23T12:57:37+05:30 IST